Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఈ వారంలోనే.. బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్..

ఈ వారంలో బ్యాంకులకు వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే ఇలాంటి కస్టమర్లకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ సెలవుల గురించి ముందుగానే తెలుసుకోవడం ఉత్తమం. లేకపోతే అసౌకర్యానికి గురవుతారు. బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి.

Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఈ వారంలోనే.. బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్..
Bank Holidays

Updated on: Jun 23, 2026 | 1:23 PM

జూన్ చివరి వారం వచ్చేస్తోంది. దీంతో బ్యాంకులను సందర్శించాలని ప్లాన్ చేసుకుంటున్న వినియోగదారులకు బిగ్ అలర్ట్. బ్యాంక్ సెలవుల వల్ల మీరు బ్యాంక్‌కు వెళ్లాల్సిన షెడ్యూల్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ప్రాంతీయ సెలవులు, వారాంతం కారణంగా జూన్ 25 నుండి జూన్ 28 మధ్య నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల కస్టమర్లు తమ శాఖలను సందర్శించే ముందు స్థానిక సెలవుల గురించి తెలుసుకోవడం ఉత్తమం.

బ్యాంక్ సెలవులు ఇవే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం జూన్ నెలలో మొత్తం 11 బ్యాంకు సెలవులను ప్రకటించింది. కొన్ని సెలవులు ప్రాంతాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. దీంతో వినియోగదారులు స్థానిక బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోండి. ఈ వారంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో వరుసగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. జూన్ 25, జూన్ 26, జూన్ 27, జూన్ 28 తేదీలలో బ్యాంకులు మూసివేయబడతాయి. మొహర్రంతో పాటు, నాలుగవ శనివారం, ఆదివారం రావడంతో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. మొహర్రం ఉత్సవాల సందర్భంగా జూన్ 25న విజయవాడలోని బ్యాంకులు మూసివేయనున్నారు. ఇర జూన్ 26న అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్‌లలో బ్యాంకు శాఖలు మూసివేయబడతాయి. ఈ సెలవులు రాష్ట్రానికి రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, వినియోగదారులు సందర్శనను ప్లాన్ చేసుకునే ముందు తమ సంబంధిత బ్యాంకు శాఖలో సెలవు వర్తిస్తుందో లేదో ధృవీకరించుకోవాలి.

దేశవ్యాప్తంగా బంద్

నాలుగవ శనివారం అయిన జూన్ 27న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. జూన్ 28వ తేదీ ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయిణ వారాంతపు సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వర్తిస్తాయి. సంత్ గురు కబీర్ జయంతిని పురస్కరించుకుని జూన్ 29న సిమ్లాలోని బ్యాంకులు మూసివేయబడతాయి.  రెమ్నా నీ అనే ప్రాంతీయ సెలవుదినం కారణంగా జూన్ 30న ఐజ్వాల్‌లోని బ్యాంకు శాఖలు మూసివేయబడతాయి. నిర్దేశిత సెలవు దినాల్లో భౌతిక శాఖలు మూసివేయబడినప్పటికీ, దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయి. వినియోగదారులు ఎప్పుడైనా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి UPI, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్‌లను ఉపయోగించుకోవచ్చు. సెలవుల సమయంలో కూడా వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండా ఏటీఎం సేవలను పొందవచ్చు.

Follow Us