
Bank Account: ఒక్కోసారి బ్యాంకులు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వకుండానే మన ఖాతా నుంచి అనవసరమైన లేదా తప్పుడు రుసుములు అంటే బ్యాక్ ఛార్జీలు కట్ చేస్తుంటాయి. ‘మినిమమ్ బ్యాలెన్స్ లేదు’ అనో, ‘SMS అలర్ట్ ఛార్జీలు’ అనో, లేదా సాంకేతిక లోపాల వల్ల మనకు తెలియకుండానే ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ (RBI) నిబంధనల ప్రకారం, బ్యాంక్ నుంచి మీ డబ్బులను తిరిగి పొందడానికి ఒక నిర్దిష్టమైన మార్గం ఉంది.
ఇది కూడా చదవండి: Insurance Claim: వాహనదారులకి ఊరటనిచ్చే తీర్పు.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!
మీరు ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా బ్యాంక్ నుంచి ఎలాంటి పరిష్కారం రాకపోయినా, లేదా బ్యాంక్ ఇచ్చే సమాధానం మీకు సంతృప్తికరంగా లేకపోయినా.. మీరు నేరుగా ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ (RBI Banking Ombudsman) ను సంప్రదించవచ్చు.
టోల్ ఫ్రీ నంబర్: మీరు ఆన్‌లైన్‌లో చేయలేకపోతే, ఆర్బీఐ కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ 14448 కి కాల్ చేసి కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈ సేవ పూర్తిగా ఉచితం. దీని కోసం వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆర్బీఐ అంబుడ్స్‌మన్ మీ ఫిర్యాదును పరిశీలించి, అది బ్యాంక్ పొరపాటేనని నిర్ధారిస్తే కట్ అయిన పూర్తి సొమ్మును వడ్డీతో సహా మీ ఖాతాలో జమ చేయాలని బ్యాంకును ఆదేశిస్తుంది. అన్యాయంగా కస్టమర్‌ను ఇబ్బంది పెట్టినందుకు కొన్ని సందర్భాల్లో ఆందోళన కలిగించిన పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించే అవకాశం ఉంది.
బ్యాంకులు చేసే ప్రతి చిన్న పొరపాటును నిర్లక్ష్యం చేయకండి. మీ అనుమతి లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా కట్ అయిన రూపాయి అయినా సరే, ప్రశ్నించి ఆర్బీఐ అంబుడ్స్‌మన్ ద్వారా తిరిగి పొందే హక్కు మీకు ఉంది.
ఇది కూడా చదవండి: Mobile Apps: ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్.. ప్రయోజనాలు తెలిస్తే వెంటనే డౌన్‌లోడ్ చేసుకుంటారు!
ఇది కూడా చదవండి: మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? ఈ స్కీమ్‌లో నెలకు ఎంత పొదుపు చేస్తే పెళ్లి, చదువు నాటికి రూ.70 లక్షలు వస్తాయి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి