Bank Account: మీ ఖాతాలో పొరపాటున లక్షల రూపాయలు జమ అయ్యాయా? ఇలా అస్సలు చేయకండి.. లేకుంటే చిక్కుల్లో పడ్డనట్లే..!

Bank Account: సాంకేతిక లోపం అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో తలెత్తే ఏదైనా చిన్న లేదా పెద్ద సాంకేతిక సమస్య. బ్యాంకుల కంప్యూటర్ వ్యవస్థలు చాలా పెద్దవిగా, సంక్లిష్టంగా ఉంటాయి. వాటిలో ప్రతిరోజూ లక్షలాది లావాదేవీలు జరుగుతాయి. కొన్నిసార్లు, సాఫ్ట్‌వేర్ బగ్ (లోపం), సర్వర్‌లో..

Bank Account: మీ ఖాతాలో పొరపాటున లక్షల రూపాయలు జమ అయ్యాయా? ఇలా అస్సలు చేయకండి.. లేకుంటే చిక్కుల్లో పడ్డనట్లే..!
Bank Account

Updated on: Jul 15, 2026 | 9:48 PM

Bank Account: ఉదయం నిద్రలేచి మీ బ్యాంక్ ఖాతాను చూసుకున్నప్పుడు అకస్మాత్తుగా అందులో 7 లక్షల రూపాయలు వచ్చి పడ్డాయని ఊహించుకోండి. మొదట మీరు సంతోషిస్తారు. కానీ ఆ తర్వాత ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు పొరపాటున వచ్చిన డబ్బుల గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా మర్చిపోరు. ఈ పరిస్థితి చాలా మందికి ఎదురైంది. కొన్నిసార్లు ఖాతా నుండి అదనపు డబ్బు కట్‌ కావడం కూడా జరుగుతుంటుంది. వీటిపై విచారణ జరపగా, ఇది ఒక సాంకేతిక లోపం (టెక్నికల్ గ్లిచ్) కారణంగా జరిగిందని వెలుగులోకి వచ్చింది. ఈ సాంకేతిక లోపం అంటే ఏమిటి? అది ఎలా జరుగుతుంది? దాని గురించి ఏమి చేయాలో తెలుసుకుందాం.

సాంకేతిక లోపం అంటే ఏమిటి?

సాంకేతిక లోపం అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో తలెత్తే ఏదైనా చిన్న లేదా పెద్ద సాంకేతిక సమస్య. బ్యాంకుల కంప్యూటర్ వ్యవస్థలు చాలా పెద్దవిగా, సంక్లిష్టంగా ఉంటాయి. వాటిలో ప్రతిరోజూ లక్షలాది లావాదేవీలు జరుగుతాయి. కొన్నిసార్లు, సాఫ్ట్‌వేర్ బగ్ (లోపం), సర్వర్‌లోని సమస్య లేదా అప్‌డేట్ కారణంగా డబ్బు పొరపాటున వేరొక ఖాతాకు బదిలీ అవుతుంది.

ఇది కూడా చదవండి: AC Capacity: ఏసీ సామర్థ్యాన్ని టన్నులలో ఎందుకు కొలుస్తారు? దాని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

ఇవి కూడా చదవండి

ఇది ఉద్దేశపూర్వకంగా జరగదు. కానీ సిస్టమ్ లోపం కారణంగా జరుగుతుంది. కంప్యూటర్‌లో కొన్నిసార్లు పొరపాటున ఫైల్ డూప్లికేట్ అయినట్లే బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బు డూప్లికేట్ అవుతుంది లేదా తప్పుడు ఖాతాకు బదిలీ అవుతుంది. ఇలాంటి కారణంగా పొరపాటున ఇతర వ్యక్తుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయి. కానీ ఈ డబ్బు మీకు ఎంత కాలం ఉండదని గుర్తించుకోండి. పొరపాటున మీరు వెంటనే విత్‌డ్రా చేసుకున్నా, ఖర్చు చేసినా చిక్కుల్లో పడిపోతారని గుర్తించుకోండి.

ఇలా ఎందుకు జరుగుతుంది?

  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమయంలో పొరపాటు
  • బ్యాంక్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నప్పుడు లోపం సంభవించవచ్చు.
  • పాత, కొత్త సిస్టమ్‌లు సరిపోలకపోతే డబ్బు మళ్లీ జమ కావచ్చు.
  • సర్వర్ ఓవర్‌లోడ్
  • పండుగలు, జీతాల జమలు లేదా పెద్ద లావాదేవీల సమయంలో సర్వర్ ఓవర్‌లోడ్ అవుతుంది. దీనివల్ల సిస్టమ్ గందరగోళానికి గురై డబ్బు తప్పుడు ఖాతాలకు బదిలీ అవుతుంది.

మానవ తప్పిదమా? లేక సిస్టమ్ లోపమా..?

  • ఒక ఉద్యోగి తప్పుగా నమోదు చేయగా, సిస్టమ్ దానిని మళ్లీ ప్రాసెస్ చేసింది.
  • థర్డ్-పార్టీ పేమెంట్ గేట్‌వే సమస్య.
  • UPI, Paytm, PhonePe వంటి యాప్‌ల ద్వారా జరిగే లావాదేవీలకు అంతరాయం కలగవచ్చు.

మీ ఖాతాలోకి అకస్మాత్తుగా డబ్బు వస్తే ఏమి చేయాలి?

  • వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. ఫోన్ చేయండి లేదా బ్రాంచ్‌ను సందర్శించండి.
  • ఆ డబ్బును ఖర్చు చేయవద్దు – ఒకవేళ మీరు ఆ డబ్బును ఖర్చు చేస్తే, అది చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. బ్యాంకు దానిని తిరిగి రాబట్టుకుంటుంది. అలాగే మీకు వడ్డీ కూడా విధించవచ్చు.

స్క్రీన్‌షాట్‌ను భద్రపరుచుకోండి:

బ్యాంకు సాధారణంగా ఈ లోపాన్ని సరిదిద్దుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థలలో సాంకేతిక లోపాలు ఒక సాధారణ సమస్య. ఇది ఉద్దేశపూర్వకంగా జరగదు. కానీ మీ ఖాతాలో అకస్మాత్తుగా డబ్బు కనిపిస్తే, కంగారు పడకుండా వెంటనే బ్యాంకుకు తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Mobile Calling: 1600, 140 సిరీస్‌ నంబర్ల నుంచి మీకు కాల్స్‌ వస్తున్నాయా? ఎవరు చేస్తారో తెలుసా..?

ఇది కూడా చదవండి: Gold Loan: మీ వద్ద తులం బంగారం ఉంటే ఎంత లోన్ వస్తుందో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us