Bajaj Pulsar NS400Z: కొత్త పల్సర్ వచ్చేసింది.. లుక్ చూశారా.. షేక్ అయిపోతారంతే..

|

May 07, 2024 | 2:27 PM

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 2024, మే 3వ తేదీన కొత్త మోటారు సైకిల్ ను ఆవిష్కరించింది. దీని పేరు అత్యంత శక్తివంతమైన, ఫీచర్ రిచ్ పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్. దీని ధర రూ.1.85 లక్షలు(ఎక్స్ షోరూం). ఈ మోటారు సైకిల్ లో రైడ్-బై-వైర్ థొరెటల్, స్పీచ్ బుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పోర్ట్, రెయిన్, రోడ్, ఆఫ్ రోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Bajaj Pulsar NS400Z: కొత్త పల్సర్ వచ్చేసింది.. లుక్ చూశారా.. షేక్ అయిపోతారంతే..
Bajaj Pulsar Ns400z
Follow us on

బజాజ్ కంపెనీ నుంచి విడుదలయ్యే ద్విచక్ర వాహనాలకు మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంటుంది. వాహనచోదకులందరూ హమారా బజాజ్ అంటూ ఈ సంస్థపై ఆత్మీయతను కనబరుస్తారు. దీని నుంచి విడుదలైన వాహనాలు అమ్మకాలలో రికార్డులు సాధించాయి. నాణ్యమైన పనితీరు, మంచి మైలేజీ ఇస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంస్థ నుంచి మరో కొత్త ద్విచక్ర వాహనం మార్కెట్ లోకి విడుదలైంది.

పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ విడుదల

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 2024, మే 3వ తేదీన కొత్త మోటారు సైకిల్ ను ఆవిష్కరించింది. దీని పేరు అత్యంత శక్తివంతమైన, ఫీచర్ రిచ్ పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్. దీని ధర రూ.1.85 లక్షలు(ఎక్స్ షోరూం). ఈ మోటారు సైకిల్ లో రైడ్-బై-వైర్ థొరెటల్, స్పీచ్ బుల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పోర్ట్, రెయిన్, రోడ్, ఆఫ్ రోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో పూర్తి ఎల్ ఈడీ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం ప్రత్యేక డిస్‌ప్లేతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ మరో ప్రత్యేకత.

ప్రతి 20 సెకన్లకు ఒక పల్సర్ విక్రయం..

బజాజ్ ఆటో ఇప్పటి వరకు 1.8 కోట్ల పల్సర్లను విక్రయించింది. 2001లో నుంచి ఇప్పటివరకూ రూ. 10,000 కోట్లను ఆర్జించింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ కంపెనీ ప్రతి 20 సెకన్లకు ఒక పల్సర్ మోటార్‌సైకిల్‌ను విక్రయిస్తుంది. దీని ప్రకారం ఈ బ్రాండ్ కు ఆదరణ తెలుస్తుంది. ఎన్ఎస్ 400 జెడ్ మోటార్‌సైకిల్ క్రాంక్ వద్ద 40 డీహెచ్ పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ పవర్‌ట్రెయిన్ నుంచి వెనుక చక్రానికి 35 ఎన్ఎమ్ టార్క్‌ విడుదలవుతుంది. ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకులున్నాయి.

ప్రత్యేకంగా హ్యాండిల్ బార్..

బజాజ్ ఆటో నుంచి వివిధ మోడళ్ల పల్సర్లకు భిన్నంగా కొత్త ఎన్ఎస్400జెట్ కు ఒక ప్రత్యేకత ఉంది. దీనిలో ఫ్లాట్ హ్యాండిల్‌ బార్‌ను ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్‌ పద్మవ్యూహం నుంచి వేగంగా బయటపడడానికి, జాతీయ రహదారులపై దూసుకుపోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కనెక్టివిటీతో కలర్ టీఎఫ్ టీ స్క్రీన్‌, కొన్ని వేరియంట్లలో టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ వ్యవస్థ ఉన్నాయి.

టాప్ స్పీడ్ 154 కిలోమీటర్లు..

పాత కేటీఎమ్ 390 డ్యూక్, బజాజ్ డామినార్ 400 బైక్ లలో కనిపించి 373 సీసీ ఇంజిన్ ను కొత్త పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ లో ఏర్పాటు చేశారు. ఇది 39 హెచ్ బీ పవర్, 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఏర్పాటు చేశారు. దీని టాప్ స్పీడ్ గంటలకు 154 కిలోమీటర్లు. జెడ్ హీరో మావ్రిక్ 440, కేటీఎమ్ 250 డ్యూక్, ట్రయంఫ్ స్పీడ్ 400, టీవీఎస్ ఆర్ టీఆర్ 310, బజాజ్ డామినార్ 400 లకు ఈ బండి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

ఆకట్టుకునే రంగులు..

పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ మోటారు సైకిల్ ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. నలుపు, తెలుపు, ఎరుపు, బూడిద రంగులలో ఆకట్టుకుంటుంది. ఈ వాహనం కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 5 వేలు డిపాజిట్‌ చెల్లించి వీటిని బుక్ చేసుకోవచ్చు. బజాజ్ సంస్థ విడుదల చేసిన కొత్త పల్సర్ ఎన్ఎస్ 400 హెచ్ వాహనం పల్సర్ శ్రేణిలో అత్యంత శక్తివంతమైన బండి చెప్పవచ్చు. ఈ బైక్ ఎన్ఎస్ 200కు బీఫియర్ వెర్షన్ లా కనిపిస్తుంది. అయినా కొంచె భిన్నమైన స్లైల్ తో కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..