Patanjali: ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి.. 3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?

|

Nov 26, 2024 | 7:07 AM

Patanjali: బాబా రామ్‌దేవ్ కంపెనీ బంపర్ లాభాలను ఆర్జించింది. గత 3 నెలల్లో కంపెనీకి భారీగా ఆదాయం వచ్చి చేరింది. గతంలో నష్టాల్లో ఉన్న పతాంజలు ఇప్పుడు లాభాల బాట పడుతోంది. ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది..

Patanjali: ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి.. 3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
Follow us on

బాబా రామ్‌దేవ్ కంపెనీ బంపర్ లాభాలను ఆర్జించింది. కంపెనీ గత 3 నెలల్లో దాదాపు రూ. 9,335 కోట్లను ఆర్జించింది. ఇందులో పతంజలి ఫుడ్స్ OFS నుండి ఆదాయాలు, ఇతర యూనిట్ల ఆదాయం కూడా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ మొత్తం ఆదాయం 23.15 శాతం పెరిగి రూ.9,335.32 కోట్లకు చేరుకుంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఇచ్చిన సమాచారంలో ఇందులో పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా), గ్రూప్‌లోని ఇతర యూనిట్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) నుండి వచ్చే ఆదాయం కూడా ఉందని పేర్కొంది. టోఫ్లర్ నివేదిక ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో పతంజలి ఫుడ్స్‌తో పాటు పతంజలి ఆయుర్వేద ఆదాయం గణనీయంగా పెరిగింది. 2023-24లో రూ.2,875 కోట్లు ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది.

గతేడాది నష్టం:

గత ఆర్థిక సంవత్సరంలో బాబా రామ్‌దేవ్ కంపెనీ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పతంజలి ఆయుర్వేదం తన ఆహార వ్యాపారాన్ని జులై 1, 2022న పతంజలి ఫుడ్స్‌కు బదిలీ చేయడం వల్ల దాని ఆదాయం 14.25 శాతం తగ్గి రూ. 6,460.03 కోట్లకు చేరుకుంది. పతంజలి ఆహార వ్యాపారంలో బిస్కెట్లు, నెయ్యి, తృణధాన్యాలు, న్యూట్రాస్యూటికల్స్ ఉన్నాయి.

2023-24లో లాభం పెరిగింది

కంపెనీ ఆదాయం క్షీణించిన తర్వాత, అదే సంవత్సరంలో పతంజలి ఆయుర్వేద ఆదాయం 2022-23లో రూ. 7,533.88 కోట్లు, మొత్తం లాభం రూ. 578.44 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దీని మొత్తం లాభం ఐదు రెట్లు పెరిగి రూ.2,901.10 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జాబితా చేయని సంస్థ పతంజలి ఆయుర్వేద్ మొత్తం ఆదాయం (ఇతర ఆదాయంతో సహా) రూ. 7,580.06 కోట్లు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి