
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది దేశంలోని సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం. ఈ పథకం ప్రారంభ దశలో 70 సంవత్సరాలు. అలాగే అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఉన్న కుటుంబాలు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందాయి. ఆ మొత్తాన్ని ఇప్పుడు సవరించారు.
ఇప్పుడు ఆరోగ్య కవరేజ్ కోసం రూ.10 లక్షలు అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లు సభ్యులుగా ఉన్న కుటుంబం రూ.10 లక్షల ఆరోగ్య కవరేజ్ పొందగలిగినప్పటికీ, మీరు అర్థం చేసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. 5 లక్షల అదనపు కవరేజ్ కేవలం సీనియర్ సిటిజన్ల చికిత్సకు మాత్రమే. కుటుంబ సభ్యులందరికీ కేటాయించిన రూ. 5 లక్షలు అయిపోయిన తర్వాత, అదనంగా వచ్చే రూ. 5 లక్షలు ఎప్పటికీ ఉపయోగం కోసం అందుబాటులో ఉండవు. ఈ బీమా కవర్ రెండు భాగాలుగా పనిచేస్తుంది.
ఎవరు అర్హులు?
ఈ పథకంలో భాగం కావడానికి అర్హతలలో ఒకటి 70 సంవత్సరాలు. అలాగే అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండటం. ఆదాయం, ఉద్యోగం, ఆర్థిక స్థితి పరిగణించరు.
అవసరమైన పత్రాలు:
ఈ పథకంలో చేరడానికి ఆధార్ కార్డు తప్పనిసరి పత్రం. ఆధార్ ద్వారా ఈ-కెవైసి పూర్తి చేయాలి. ఇతర పత్రాలు అవసరం లేదు. ఆధార్ కార్డులో పేర్కొన్న పుట్టిన సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం జనవరి 1ని అధికారిక పుట్టిన తేదీగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆయుష్మాన్ పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా దరఖాస్తును సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తేదీ నుండి చికిత్స సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
ఇది కూడా చదవండి: Gold: 9 క్యారెట్లలో ఎంత బంగారం ఉంటుంది..? దాన్ని ఎలా తయారు చేస్తారు?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి