Axis Bank: కస్టమర్లకు యాక్సిస్‌ బ్యాంకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.150తోనే ప్రత్యేక పొదుపు ఖాతా

|

Aug 30, 2023 | 3:52 PM

శంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాతగా 'ఇన్ఫినిటీ సేవింగ్స్ ఖాతా'గా నామకరణం చేసింది. దాని కోసం కస్టమర్‌లకు నెలకు రూ.150 లేదా సంవత్సరానికి ఒకేసారి రూ.1,650 చెల్లించిన సరిపోతుందని బ్యాంకు వెల్లడించింది. ఈ అకౌంట్‌ తీసుకున్న వినియోగదారులు ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు గానీ, ఇతర ఛార్జీలు ఏమి ఉండవని తెలిపింది. ప్రస్తుతం ఏ బ్యాంకు అకౌంట్‌ తీసుకున్నా అందులో నెలవారీగా కనీస బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది.

Axis Bank: కస్టమర్లకు యాక్సిస్‌ బ్యాంకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.150తోనే ప్రత్యేక పొదుపు ఖాతా
Axis Bank
Follow us on

యాక్సిస్ బ్యాంక్ తన వినియోగదారుకు శుభవార్త తెలిపింది. ప్రత్యేక పొదుపు ఖాతాను ప్రారంభించింది. ఇందులో భాగంగా వినియోగదారులు కేవలం నెలకు 150 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని బ్యాంకు తెలిపింది. అంతేకాదు ఖాతా పొందిన తర్వాత అందులో మినిమమ్‌ బ్యాలెన్స్‌ కూడా ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్‌ బ్యాంకు తెలిపింది. అకౌంట్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేకుండా ఇతర ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తోంది. అయితే దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాతగా ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ ఖాతా’గా నామకరణం చేసింది. దాని కోసం కస్టమర్‌లకు నెలకు రూ.150 లేదా సంవత్సరానికి ఒకేసారి రూ.1,650 చెల్లించిన సరిపోతుందని బ్యాంకు వెల్లడించింది.

ఈ అకౌంట్‌ తీసుకున్న వినియోగదారులు ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు గానీ, ఇతర ఛార్జీలు ఏమి ఉండవని తెలిపింది. ప్రస్తుతం ఏ బ్యాంకు అకౌంట్‌ తీసుకున్నా అందులో నెలవారీగా కనీస బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది. అకౌంట్లో కనీస నిల్వ లేనట్లయితే భారీగా పెనాల్టీ ఛార్జీలు విధిస్తోంది. ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌తో పాటు పాస్‌బుక్‌ ప్రింటింగ్ మొదలైన సేవల కోసంఛార్జ్ చేస్తారు.

ఇలాంటి సమయంలో యాక్సిస్‌ బ్యాంకు కేవలం 150లతోనే ఖాతా తీసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ వంటి కొన్ని ప్లేయర్‌లు, కొత్త ఖాతాతో Axis బ్యాంక్ పరిచయం చేస్తున్న వార్షిక ఖాతా నిర్వహణ రుసుమును వసూలు చేస్తారు. అయితే ప్రస్తుతం డిజిటల్‌ అకౌంట్లను వినియోగించుకుంటున్నారు. అలాంటి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అండ్‌ హెడ్ రవి నారాయణన్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే కస్టమర్‌కు అవసరమైనన్ని సార్లు ఏటీఎంలలో ఉపయోగించగల ఉచిత డెబిట్ కార్డ్‌లను కూడా అందిస్తుంది. చెక్‌ బుక్‌ వినియోగం, పరిమితుల కంటే ఎక్కువ లావాదేవీలు, ఉపసంహరణలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. యాక్సిస్‌ బ్యాంకు అందించే పొదుపు ఖాతాను సులభంగా తీసుకునే అవకాశం పొందవచ్చు. ఈ రోజుల్లో అకౌంట్‌ తీసుకున్నట్లయితే ప్రాంతాల వారీగా ఖాతాల్లో డబ్బు నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఏరియాను బట్టి ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంచాల్సి ఉంటుంది. దీంతో యాక్సిస్‌ బ్యాంకు అందించే ఈ ప్రత్యేక పొదుపు ఖాతాలో కనీస నిల్వ ఇబ్బందులు లేకుండా ఖాతాను పొందవచ్చు. ఇప్పటికే అకౌంట్లలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ కారణంగా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాయి బ్యాంకులు. బ్యాంకులు ఈ మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేని కారణంగా ఎంత వసూలు చేశాయన్నది కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల నివేదికలు విడుదల చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి