Axis Bank: పొదువు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంక్.. ఎంత పెరిగాయంటే..

|

May 12, 2022 | 7:44 AM

ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్(Axis Bank) సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లను మార్చింది. యాక్సిస్ బ్యాంక్ మే 10 నుంచి పొదుపు ఖాతాల(Saving Account)పై వడ్డీ(Interest) రేట్లను 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచింది.

Axis Bank: పొదువు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంక్.. ఎంత పెరిగాయంటే..
Axis Bank
Follow us on

ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్(Axis Bank) సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లను మార్చింది. యాక్సిస్ బ్యాంక్ మే 10 నుంచి పొదుపు ఖాతాల(Saving Account)పై వడ్డీ(Interest) రేట్లను 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచింది. మే 10 నుంచి రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై ఏడాదికి 3 శాతం వడ్డీ రేటు ఉంటుంది. రూ. 50 లక్షల నుంచి రూ. 2,500 కోట్ల లోపు నిల్వలు ఉన్న పొదుపు ఖాతాలపై బ్యాంకు 3.5 శాతం వడ్డీని ఇస్తుంది. యాక్సిస్ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో 10 మే 2022 నుంచి మీ సేవింగ్స్ ఖాతాపై వడ్డీని సవరించినట్లు తెలిపింది. యాక్సిస్ బ్యాంక్‌లో, సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేటు రోజువారీగా లెక్కిస్తారు. ఖాతాలోని బ్యాలెన్స్‌పై వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR)లో 10 శాతం పెంపును ప్రకటించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చాయి. MCLR అనేది బెంచ్‌మార్క్ వడ్డీ రేటు, బ్యాంకులు రుణాలు తీసుకోవడానికి అనుమతించే అతి తక్కువ రేటు. అంతకుముందు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI అన్ని కాలాల్లో MCLR ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. SBI పెరిగిన వడ్డీ రేట్లు 15 ఏప్రిల్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ఎంసీఎల్‌ఆర్‌ పెంపుతో యాక్సిస్‌ బ్యాంక్‌ గృహ రుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణాలపై భారం పడనుంది. దీంతో కస్టమర్ల EMI పెరుగుతుంది.

Read Also.. Stock Market: వరుసగా నాలుగో సెషన్‌లో నష్టపోయిన స్టాక్‌ మార్కెట్లు.. 54,088 పాయింట్లకు చేరిన సెన్సెక్స్..