దసరా, దీపావళి పండగులను క్యాష్ చేసుకునే క్రమంలో ఈ కామర్స్ సైట్స్ బంపరాఫర్ ప్రకటించాయి. అమెజాన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ సైతం సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇక పండగలకు కార్లను కొనుగోలు చేయడం భారతీయులకు ఒక సెంటిమెంట్‌గా వస్తోంది.
అయితే దీనికి అనుగుణంగానే ఆటోమొబైల్ కంపెనీలు సైతం పండగ సీజన్‌లో కొత్త మోడల్స్‌ను లాంచ్ చేయడంతోపాటు, డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పలు ఆటో మొబైల్ సంస్థలు భారీ ఎత్తున డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. కార్ల కంపెనీలను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. వీటితో పాటు డీలర్లు సైతం కార్ల యాక్ససరీలపై అదనంగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. అక్టోబర్ 31వ వరకు ఈ ఆఫర్లు అందించనున్నారు.
* భారత్‌లో కార్లకు పెట్టింది పేరైన మారుతీ సుజుకీ తమ బ్రాండ్‌కు చెందిన పలు కార్లపై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. ఆల్టో, వేగనార్, సెలెరియో, ఎస్ ప్రెసో కార్లపై ఏకంగా రూ. 61 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అలాగే స్విఫ్ట్‌పై రూ. 54 వేల ఆఫర్ అందిస్తున్నారు.
* ఇక మరో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కూడా భారీగా డిస్కౌంట్స్ అందిస్తోంది. హ్యూందయ్‌కి చెందిన ఎక్స్‌టర్, వెన్యూ, క్రెటా మినహా మిగిలిన అన్ని మోడళ్లపై ఆఫర్లను అందిస్తోంది. మోడల్ బట్టి.. రూ.10 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ.43 వేలు, ఆరాపై రూ.33 వేల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు.
* ఇక మహీంద్రా కంపెనీ కూడా ఏకంగా రూ. 90 వేల వరకు డిస్కౌంట్స్ ఇవ్వనున్నారు. ఎక్స్‌యూవీ300పై రూ.90 వేలు, విద్యుత్ ఎక్స్‌యూవీ400పై రూ.1.25 లక్షలు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. బొలెరోపై రూ.70 వేలు, బొలెరో నియోపై రూ.50 వేల రాయితీ ఉన్నట్లు తెలిపింది.
* ఇక టయోటా హీలక్స్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, జీప్ మెరీడియన్, జీప్ కంపాస్, ఎంజీ హెక్టార్, ఎంజీ జెడ్‌ఎస్ ఈవీపై రూ.1 లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది పండుగల నేపథ్యంలో కార్ల అమ్మకాలు 10 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉందని ఆటో మొబైల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..