బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

నేటి వేగవంతమైన జీవితంలో ఆటో పేమెంట్లు, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, ఆర్థిక భద్రతకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. చెల్లింపు వివరాలను నిశితంగా పరిశీలించడం, విశ్వసనీయ వేదికలను మాత్రమే ఎంచుకోవడం, ఖాతాను నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యం. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

బ్యాంక్‌ అకౌంట్‌కు ఆటో పే ఎనేబుల్‌ చేశారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!
Auto Payments

Updated on: Mar 31, 2026 | 10:10 PM

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఈఎంఐలు, విద్యుత్ బిల్లులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, బీమా ప్రీమియంల వంటి నెలవారీ చెల్లింపులను సకాలంలో పూర్తి చేయడానికి చాలా మంది స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ లేదా ఆటోమేటిక్ పేమెంట్‌లను ఆశ్రయిస్తున్నారు. బ్యాంక్ ఖాతా నుంచి నిర్దిష్ట తేదీకి డబ్బు స్వయంచాలకంగా కట్ కావడం వల్ల చెల్లింపులు మిస్ అవ్వకుండా ఉండటం ఈ విధానం ప్రధాన ప్రయోజనం. అయితే ఈ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్న వారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌ను ఏర్పాటు చేసే సమయంలో, మొత్తం వివరాలను జాగ్రత్తగా చదవడం అవసరం. ఎన్ని రూపాయలు కట్ అవుతాయి, ఎంత తరచుగా కట్ అవుతాయి, చెల్లింపు విధానం ఏమిటి వంటి అంశాలను స్పష్టంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులు లేదా యుటిలిటీ బిల్లుల వంటి సందర్భాల్లో మొత్తం మారుతూ ఉండే అవకాశం ఉండటం వల్ల, ఖర్చులపై ముందస్తు అంచనా ఉండాలి. అదే సమయంలో ఈ సేవలను ఉపయోగించడానికి విశ్వసనీయమైన వేదికలను మాత్రమే ఎంచుకోవడం అత్యంత కీలకం. బ్యాంకుల అధికారిక యాప్‌లు లేదా నమ్మదగిన వెబ్‌సైట్‌లను ఉపయోగించడం ద్వారా మోసాల నుంచి రక్షణ పొందవచ్చు. తెలియని యాప్‌లు లేదా అనుమానాస్పద వెబ్‌సైట్‌ల ద్వారా ఆటో పేమెంట్‌లను ఏర్పాటు చేయడం ప్రమాదకరం.

ఆటో పేమెంట్‌లు ప్రారంభమైన తర్వాత కూడా ఖాతా పర్యవేక్షణను విస్మరించకూడదు. ప్రతి నెలా లావాదేవీలను పరిశీలించడం ద్వారా అనుమానాస్పద కోతలను గుర్తించవచ్చు. చిన్న మొత్తాల్లో జరిగే అనధికారిక లావాదేవీలు కూడా కాలక్రమేణా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపించిన వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించడం ముఖ్యం. అవసరమైతే ఆ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌ను తక్షణమే రద్దు చేయాలి. సమయానికి స్పందించడం ద్వారా ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us