Electric Scooters: మార్కెట్‌ను షేక్‌ చేయనున్న ఈ 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. త్వరలో భారతదేశంలో లాంచ్!

Electric Scooters: నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీలు సరికొత్త మోడళ్లతో ఈవీలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ మోడల్స్ ఏవి, అవి ఎప్పుడు మార్కెట్లోకి విడుదల అవుతాయని తెలుసుకుందాం..

Electric Scooters: మార్కెట్‌ను షేక్‌ చేయనున్న ఈ 4 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. త్వరలో భారతదేశంలో లాంచ్!

Updated on: Jun 14, 2025 | 1:25 PM

Electric Scooters: కొత్త ఎలక్ట్రిక్ స్టార్టప్‌లు మాత్రమే కాదు.. పెద్ద ఆటో కంపెనీలు కూడా కొత్త మోడళ్లతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో సందడి చేస్తున్నాయి. ఒకటి లేదా రెండు కాదు, నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీలు సరికొత్త మోడళ్లతో ఈవీలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ మోడల్స్ ఏవి, అవి ఎప్పుడు మార్కెట్లోకి విడుదల అవుతాయని తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Eelectric Car: వినియోగదారులకు సువర్ణావకాశం.. ఈ కారుపై ఏకంగా రూ. 4.44 లక్షలు తగ్గింపు!

సుజుకి ఈ-యాక్సెస్:

హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసినప్పుడు సుజుకి ఎలా వెనుకబడి ఉంటుంది. అందుకే సుజుకి కూడా ఒక అడుగు ముందుకేసింది. సుజుకి ఈ నెలలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 3.07kWh బ్యాటరీతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 4.1kWh ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఈ మోడల్ ఖచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ పరిధికి సంబంధించి ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని చెబుతున్నారు. ఇది కాకుండా ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 71 కి.మీ.

ఇవి కూడా చదవండి

హీరో ప్యాషన్ VX2:

హీరో మోటోకార్ప్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే నెల జూలై 1న లాంచ్ కానుంది. ఈ స్కూటర్‌ను చిన్న TFT డిస్‌ప్లే, 12 అంగుళాల చక్రాలతో లాంచ్ చేయవచ్చు. ఈ స్కూటర్ V2 మోడల్ మాదిరిగానే బ్యాటరీ ఎంపికను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం కంపెనీ దీనిని ఎలాంటి వివరాలు ధృవీకరించలేదు.

బజాజ్ చేతక్ చౌక వేరియంట్:

మీడియా నివేదికల ప్రకారం.. బజాజ్ త్వరలో భారతదేశంలో కస్టమర్ల కోసం సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఈ రాబోయే స్కూటర్ 3503 వేరియంట్ కంటే చౌకగా ఉండవచ్చు. ఈ కొత్త స్కూటర్ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ వేరియంట్ అయిన చేతక్ 2903 ఆధారంగా ఉండవచ్చని తెలుస్తోంది.

టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్:

TVS iQube స్కూటర్ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు కంపెనీ ఈ మోడల్ కంటే చౌకైన స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ రాబోయే స్కూటర్ పేరు ఆర్బిటర్ కావచ్చు. ఈ స్కూటర్ ధర దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని అంచనా.

ఇది కూడా చదవండి: Snake Plants: ఈ 5 మొక్కలు మీ ఇంట్లో ఉంటే పాములు దరిదాపుల్లోకి రావు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి