Ather Rizta: మార్కెట్లోకి మరో సూపర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే..

ఏథర్‌ రిజ్తా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రిజ్తా ఎస్, రిజ్తా జడ్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. రిజ్తా ఎస్‌ స్కూటర్‌లో 2.9 కిలో వాట్‌ బ్యాటరీని అందిస్తున్నారు. అలాగే రిజ్తా జడ్‌లో 3.7 కిలోవాట్‌తో తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 123 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఇందులో టాప్‌ ఎండ్‌ వెర్షన్‌ స్కూటర్‌తో 160 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు....

Ather Rizta: మార్కెట్లోకి మరో సూపర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే..
Ather Rizta

Updated on: Apr 06, 2024 | 7:34 PM

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఏథర్‌ మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఏథర్‌ రిజ్తా పేరుతో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌లో పొడవాటి సీటును, అధిక లెగ్‌స్పేస్‌ను అందించారు. ముఖ్యంగా ఫ్యామిలీలకు సెట్‌ అయ్యేలా ఈ స్కూటర్‌ను డిజైన్‌ చేశారు. ఇంతకీ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఏథర్‌ రిజ్తా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రిజ్తా ఎస్, రిజ్తా జడ్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. రిజ్తా ఎస్‌ స్కూటర్‌లో 2.9 కిలో వాట్‌ బ్యాటరీని అందిస్తున్నారు. అలాగే రిజ్తా జడ్‌లో 3.7 కిలోవాట్‌తో తీసుకొచ్చారు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 123 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఇందులో టాప్‌ ఎండ్‌ వెర్షన్‌ స్కూటర్‌తో 160 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్‌ గరిష్టంగా 80 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

ధర విషయానికొస్తే రిజ్తా ఎస్‌ ఎక్స్‌ షోరూం ధరను రూ. 1.10 లక్షలుగా నిర్ణయించారు. అదే విధంగా రిజ్తా జడ్‌ మోడల్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 1.25 లక్షలుగా నిర్ణయించారు. రిజ్తా ఎస్‌ను మూడు రంగుల్లో, రిజ్తా జడ్‌ను ఏడు రంగుల్లో తీసుకొచ్చారు. ఇ స్కూటర్‌ బేస్‌ వేరియంట్‌లో 7 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే మిగతా వేరియంట్‌లో 7 ఇంచెస్‌తో కూడిన టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ స్క్రీన్‌ ద్వారా గూగుల్‌ మ్యాప్స్‌ వంటి ఫీచర్లను పొందొచ్చు. ఫోన్‌తో ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌ కోసం ప్రత్యేక సెటప్‌ను ఇచ్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..