Mukesh Ambani: అంబానీయా మజాకా..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి.. కొడుకు వివాహానికి ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు!

|

Jul 08, 2024 | 12:59 PM

సాధారణ మధ్యతరగతి కుటుంబాలే పెళ్లిళ్ల విషయంలో ఆర్భాటాలకు పోతుంటారు. అలాంటిది కుబేరుడి ఇంట పెళ్లి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్‌ సంబురాలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో వెడ్డింగ్‌ వేడుకలు. ఈ వేడుకలు ప్రపంచమే నివ్వెరపోయేలా జరుగుతున్నాయి. ఖర్చు కూడా కళ్లుచెదిరే..

Mukesh Ambani: అంబానీయా మజాకా..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి.. కొడుకు వివాహానికి ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు!
Ambani Family
Follow us on

సాధారణ మధ్యతరగతి కుటుంబాలే పెళ్లిళ్ల విషయంలో ఆర్భాటాలకు పోతుంటారు. అలాంటిది కుబేరుడి ఇంట పెళ్లి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్‌ సంబురాలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో వెడ్డింగ్‌ వేడుకలు. ఈ వేడుకలు ప్రపంచమే నివ్వెరపోయేలా జరుగుతున్నాయి. ఖర్చు కూడా కళ్లుచెదిరే రేంజ్‌లోనే ఉంది.

ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి అన్నట్టుగా భారత సంపన్నుడు ముకేశ్ అంబానీ ఇంట్లో వివాహ వేడుకలు జరుగుతున్నాయి. జులై 12న శుభ్‌ వివాహ్‌తో అనంత్‌ అంబానీ, రాధిక మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి పెళ్లిపీటలపై అనంత్- రాధిక కూర్చోనున్నారు. జులై 13న శుభ్ ఆశీర్వాద్‌ వేడుక జరగనుంది. జులై 14న వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు హాజరయ్యే అతిథులందరూ ఇండియన్ చిక్ దుస్తులను ధరించనున్నారు. ఈ వివాహ వేడుకకు సినీ తారలు, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. అనంత్-రాధిక సంగీత్ కార్యక్రమంలో వారి ప్రేమ కథను వర్ణించే నృత్య ప్రదర్శనను చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సంగీత్ కార్యక్రమంలో అనంత్-రాధిక స్నేహితుల నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Home Loan: బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే ఎవరు చెల్లిస్తారు? నిబంధనలు ఏంటి?

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక ముచ్చట్లు చూస్తున్నా, ఎంత వింటున్నా.. తనివి తీరడం లేదు. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికే కాదు.. ఆహ్వాన పత్రిక కూడా హైలేటే. వీళ్ల పెళ్లికి అంబానీ కుటుంబం ఓ స్పెషల్ వెడ్డింగ్ కార్డును తయారుచేయించారు. అందులో వెండితో చేసిన చిన్న గుడి, అందులో బంగారు విగ్రహం కనిపిస్తున్నాయి. పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాక్ గ్రౌండ్‌లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపించేలా ఏర్పాటు చేశారు. ఆలయంలో కాకుండా ఇతర బాక్సుల్లోనే బంగారంతో చేసిన దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. పెళ్లి కార్డులో వినాయకుడు, శ్రీవిష్ణువు, లక్ష్మీదేవి, రాధా- కృష్ణ, దుర్గాదేవి వంటి దేవుళ్ల చిత్రాలు కనిపిస్తున్నాయి. ఎరుపు, బంగారు వర్ణంలో రూపొందించిన వెడ్డింగ్‌ కార్డు ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈ వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు నీతా అంబానీ. ఆ తర్వాత సన్నిహితులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఆహ్వాన పత్రికలు అందిస్తూ పెళ్లికి పిలుస్తోంది అంబానీ కుటుంబం.

ఇది కూడా చదవండి: PM Modi: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా మోడీ సర్కార్‌.. అదేంటో తెలుసా?

2018లో కూతురు పెళ్లి చేశారు ముకేష్ అంబానీ. అప్పట్లో ఆ పెళ్లి హాట్ టాపిక్. ఒక్కో శుభలేఖకు 3 లక్షలు ఖర్చు చేశారు. దేశ విదేశాల నుంచి ప్రముఖుల్ని రప్పించారు. ఈ భూమ్మీద అత్యంత ఖరీదైన సింగర్స్ లో ఒకరైన బియాన్స్, అంబానీ కూతురు పెళ్లిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అప్పట్లోనే ఆమెకు దాదాపు 50 కోట్లు ఇచ్చారు. ఓవరాల్ గా కూతురు పెళ్లికి ముకేష్ అంబానీ అప్పట్లోనే 830 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇండియాలో ఓ పెళ్లి కోసం ఇంత మొత్తం ఖర్చు చేయడం అదే తొలిసారి. అదే బిగ్గెస్ట్ ఎమౌంట్. ఆ తర్వాత 2019లో కొడుకు ఆకాష్ అంబానీ పెళ్లి చేశారు. ఈసారి తన రికార్డ్ ను తానే బ్రేక్ చేశారు. కొడుకు ప్రీ-వెడ్డింగ్ సంబరాల్ని స్విట్జర్లాండ్ లో ఏర్పాటు చేసిన అంబానీ, కేవలం ఆ 3 రోజుల ఫంక్షన్ కే 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెబుతారు. ఆ తర్వాత ముంబయిలో మరో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అలా 2019లో కొడుకు పెళ్లి కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంబానీ.

ఇది కూడా చదవండి: Ambani Family Dance : మామూలుగా లేదుగా.. సంగీత కచేరిలో వేదికపై డ్యాన్స్‌తో అదరిగొట్టిన అంబానీ ఫ్యామిలీ

ఇప్పుడు మరో కొడుక్కి పెళ్లి చేస్తున్నారు. సరిగ్గా వారంలో అనంత్ అంబానీ పెళ్లి. ఈ పెళ్లి కోసం ముకేష్ అంబానీ పెడుతున్న ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే. ఇప్పటివరకు జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలకే అక్షరాలా 1260 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లి తంతు ముగిసేనాటికి ఖర్చు 1500 కోట్ల రూపాయలకు చేరుతుందని ఓ అంచనా. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిపోనుంది అనంత్ అంబానీ వివాహం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి