ఈ ఏప్రిల్ నెలలో బ్యాంకు పనులు ఉన్న వారు సెలవు దినలు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నెలలో నేషనల్, రిజినల్ సెలవులతో కలిపి బ్యాంకులకు 15 రోజులు సెలవులు రానున్నాయి. ఇందులో ఆదివారం, రెండో, నాల్గో శనివారాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్4 మంగళవారం రోజున అనేక రాష్ట్రాల్లో మహావీర్ జయంతి నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక బ్యాంక్ సెలవు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3, ఏప్రిల్ 4 తేదీలలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. ఇక ఏప్రిల్ 5 (బుధవారం)- బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు- హైదరాబాద్‌లో బ్యాంకులకు హాలీడే ప్రకటించాయి.
– ఏప్రిల్ 7 గుడ్ ఫ్రైడే కారణంగా త్రిపుర, గుజరాత్, అస్సాం, రాజస్థాన్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ మినహా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
– ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మిజోరాం, మధ్యప్రదేశ్ మినహా చాలా ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
– ఏప్రిల్ 15 విషు/బోహాగ్ బిహు/హిమాచల్ డే/బెంగాలీ నూతన సంవత్సర దినం (నబాబర్ష)- త్రిపుర, అస్సాం, కేరళ, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు.
– ఏప్రిల్ 18 షబ్-ల్-ఖదర్- జమ్మూ , శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.
– ఏప్రిల్ 21 ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్)/గరియా పూజ/జుమాత్-ఉల్-విదా- త్రిపుర, జమ్ము, కేరళలోని శ్రీనగర్‌లలో బ్యాంకులు పని చేయవు.
– ఏప్రిల్ 22 రంజాన్ ఈద్ (ఈద్-ఉల్-ఫితర్), నాల్గవ శనివారం బ్యాంకులు పనిచేయవు.
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం సెలవు
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం సెలవు
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే.
మరిన్ని జాతీయ వార్తల కోసం..