Chitra Ramakrishna: NSE మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ ఓ అదృశ్య యోగి ప్రభావానికి గురయ్యారన్న వార్త మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆ అదృశ్య యోగి ఎవరు? చిత్ర అసలు ఆమె మాయలో ఎలా పడ్డారు అనే అనుమానాలు అందరినీ ఆలోజింపచేశాయు. చివరికి హిమాలయ యోగి విషయంలో అందరి అనుమానాలను నిజం చేస్తూ ఎన్‌ఎస్‌ఈలో చిత్ర హయాంలో అమాంతం ఎదిగిన ఆనంద్ సుబ్రమణియన్ అని తెలిసింది. ఎన్‌ఎస్‌ఈలో విధులు నిర్వర్తించిన ఆనంద్ సుబ్రమణియనే ఆ యోగి అని.. అతడే చిత్ర రామకృష్ణతో ఈ-మెయిల్స్ ద్వారా సంభాషణలు జరిపినట్లు సీబీఐ వర్గాలు సమాచారం మేరకు బహిర్గతమైంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ.. అజ్ఞాత యోగి ఆనందేనన్న విషయం దాదాపు నిర్ధరణ అయింది.
సుబ్రమణియన్.. చిత్రతో చాట్ చేసేందుకు rigyajursama@outlook.com అనే మెయిల్ ఐడీని ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ-మెయిల్ ఐడీకి చిత్ర పంపిన కొన్ని మెయిల్స్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు సుబ్రమణియన్ వ్యక్తిగత ఈ-మెయిల్‌లో ఉన్నట్లు తెలిపాయి. ఎన్ఎస్‌ఈ కో- లొకేషన్ కుంభకోణం కేసులో ఆనంద్ సుబ్రమణియన్, చిత్ర రామకృష్ణపై గతంలో కేసులు నమోదయ్యాయి. తాజాగా అజ్ఞాత యోగి వ్యవహారం బయటకు రావటంతో ఈ కేసును అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి సుబ్రమణియన్‌ను ఈ నెల 19 నుంచి పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం గురువారం రాత్రి చెన్నైలో అతడిని అరెస్టు చేసి దిల్లీకి తరలించారు.
ఎన్‌ఎస్‌ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించటం.. తిరిగి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనాపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులోనే ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్ర రామకృష్ణకు సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. హిమాలయాల్లో ఉండే ఓ యోగి.. చిత్రపై ప్రభావం చూపించారని, ఆమెను కీలుబొమ్మలా ఉపయోగించుకుని ఎన్‌ఎస్‌ఈని నడిపించారని సెబీ గుర్తించింది. ఆ యోగి ప్రభావం వల్లే ఎలాంటి క్యాపిటల్ మార్కెట్ అనుభవం లేని వ్యక్తిని ఎన్‌ఎస్‌ఈ ఆపరేటింగ్ ఆఫీసర్, సలహాదారుగా నియమించారని సెబీ పేర్కొంది. దీనికి తోడు అత్యంత గోప్యంగా ఉంచవలసిన ఎన్ఎస్ఈ సమాచారం బయటకు వెళ్లిందని సెబీ తన దర్యాప్తులో గుర్తించింది. అసలు ఓ యోగి చేతిలో చిత్రి చిక్కుకున్నారన్న విషయం మార్కెట్లో ఒక ప్రకంపననే సృష్టించిందని చెప్పాలి. ఎట్టకేలకు దర్యాప్తు ముందుకు సాగిన కొద్దీ.. అందరి అనుమానాలు నిజమవుతూ ఆనంద్ సుబ్రమణియన్ వ్యవహారం క్లైమాక్స్ కు వచ్చింది. ఒక ఈ-మెయిల్ లో అజ్ఞాత యోగి.. మనిషైతే సుబ్రమణియన్ లా ఉంటానంటూ కనిపించిన మాటలు కథకు ఎండ్ కార్డ్ పడేలా చేసింది.
ఇవీ చదవండి..
Sunflower Oil: మీరు సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..
WhatsApp: వాట్సప్ అందిస్తున్న మరో కొత్త ఫీచర్.. దీంతో మెసేజింగ్ అనుభవం అదిరిపోతుంది..