Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దిగ్గజ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా మరో సారి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ మంచి విషయాలను, ఫన్నీ వీడియోలను, టాలెంట్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశంశిస్తుంటారు. అనేక సార్లు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఫన్నీగా సమాదానాలు కూడా చెబుతుంటారు. ఏదైమేనా ఆయన రూటే సరపేటని చెప్పుకోక తప్పదు. తాజాగా మహీంద్రా కంపెనీ నుంచి మార్కెట్లోకి వస్తున్న స్కార్పియో- ఎస్ మోడల్ కారు వివరాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా సదరు కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.
ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ.. ఒక ట్విట్టర్ యూజర్ ఫన్నీగా స్పందించారు. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ షెట్టి యాక్షన్ సీక్వెల్ ను ప్లాన్ చేస్తాడంటూ సదరు కారుపై కామెంట్స్ చేశాడు. అంటే ఇంకేముందు తనదైన శైలిలో దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఆసలు ఈ వాహనాన్ని పేల్చాలంటే రోహిత్ షెట్టికి న్యూక్లియర్ బాంబ్ అవసరమంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. రోహిత్ షెట్టి యాక్షన్ సీన్లు తీయటంలో పెట్టింది పేరు.
Rohit Shetty ji, is gaadi ko udaane ke liye aap ko ek nuclear bomb ki aavashyakata hogi…? #BigDaddyOfSUVs #MahindraScorpioN https://t.co/wfmVihUvoE
— anand mahindra (@anandmahindra) May 21, 2022