Anand Mahindra: సాధారణంగా మనం రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు ఆటోల వెనుక, ట్రక్కులు(Trucks), లారీల వెనుక రకరకాల కొటేషన్లు రాసి ఉండడం చూస్తుంటాము. అయితే.. వాటిలో కొన్ని కొటేషన్స్(Quotation) మనను ఆలోచింపచేసేలా ఉంటాయి. మరికొన్ని మాత్రం కాస్త భిన్నంగా, ఫన్నీగా నవ్వు తెప్పిస్తుంటాయి. కానీ.. ఇప్పుడు ఒక ట్రక్ వెనుక రాసి ఉన్న కొటేషన్ ఒకటి సోషల్ మీడియాలో అందరినీ ఆలోచింపచేస్తోంది.
అలాంటి ఒక కొటేషన్ పై.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ ఫోటోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశారు. పైగా దానికి బ్రిలియంట్ అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహీంద్రా కన్ను ఈ సారి ఒక ట్రక్ వెనుక రాసి ఉన్న ఒక కొటేషన్ మీద పడింది. దానిలో ఇమిడి ఉన్న భద్రతా పరమైన సారాంశాన్ని ఆయన మెచ్చుకున్నారు. విషయం వ్యంగ్యంగా రాసి ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచించటమే దాని వెనుకు ఉన్న అసలు మెసేజ్. ఆ ట్రక్ ఓనర్ దానిని కాస్త భిన్నంగా “టెస్ట్ యువర్ ఎయిర్‌బ్యాగ్ హియర్” అంటూ రాశారు.
Brilliant… pic.twitter.com/aDYsKOyNaP
— anand mahindra (@anandmahindra) April 15, 2022
దానికి అర్థం ఏంటంటే.. మీ వాహన ఎయిర్ బ్యాగ్ ను ఇక్కడ పరీక్షించుకోండి అని. ఇలా ప్రతి ట్రక్ వెనుక రాసి ఉంచడం చాలా బెటర్ పని అని.. సదరు యజమాని చాలా బ్రిలియంట్ అంటూ ఆ లారీ ఓనర్ కు ఆనంద్ మహీంద్రా కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అందరూ విభిన్నంగా స్పందిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మహీంద్రా వాహనాల ఎయిర్ బ్యాగ్ లను పరీక్షిద్దాం అంటూ కామెంట్ చేశారు. మరికొందరైతే అలాంటి విభిన్నమైన కొటేషన్లు ఉన్న వాహనాలు ఫొటోలను జవాబుగా జోడిస్తున్నారు.
ఇవీ చదవండి..
LIC: ఫెమా నిబంధనలను సవరించిన ప్రభుత్వం.. ఎల్‌ఐసీలో 20 శాతం ఎఫ్‌డీఐ పెట్టుబడులకు మార్గం సుగమం..
Gas Prices: కేంద్రం ఆ పని చేయనందునే ఆకాశానికి గ్యాస్ ధరలు .. ఆందోళనలో పరిశ్రమ వర్గాలు..