
అమెరికా అంటే సంపన్న దేశమని ప్రపంచం మొత్తం అనుకుంటూ ఉంటుంది. అంతర్జాతీయ కంపెనీలు అన్నీ అక్కడ నుంచే ప్రపంచం మొత్తం విస్తరిస్తున్నాయి. అనేక ఆవిష్కరణలు అమెరికాలో పుట్టుకొస్తున్నాయి. దీంతో అమెరికా అంటే ధనవంతులు ఉండే దేశమని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ అది అక్షరాలా నిజం కాదని తేలిది. తాజాగా ప్రపంచ దేశాల ప్రభుత్వ అప్పుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వాలు తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనాలతో విజువల్ క్యాపిటలిస్ట్ సంస్థ విడుదల చేసింది. దాదాపు ముప్పై దేశాల వివరాలు ఇందులో ఉండగా.. షాకింగ్ విషయాలు వెలుగులో వచ్చాయి. ఎంత అగ్రరాజ్యమైనా సరే అప్పులు చేయడం తప్పదని అమెరికా అప్పుల లెక్కలను బట్టి చూస్తే అర్ధమవుతుంది. అమెరికా నెత్తిన ఏకంగా 40 వేల బిలియన్ డాలర్ల భారీ అప్పు ఉన్నట్లు ఈ నివేదికలో తేలింది. ఈ జాబితాలో అమెరికా ఏకంగా తొలి స్థానంలో నిలిచింది. అమెరికాకు ఏకంగా 40 వేల 739 బిలియన్ డాలర్ల అప్పు ఉన్నట్టు తేలింది. ఇక రెండో స్థానంలో చైనా 22 వేల 290 బిలియన్ డాలర్లతో ఉండగా.. జపాన్ మూడో స్థానంలో ఉంది.
ఇక బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.భారతదేశం ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. భారతదేశం 3 వేల 464 బిలియన్ డాలర్ల అప్పు చేసినట్లు బయటపడింది. ఇక ఇటలీ, జర్మనీ దేశాలు ఆరు, ఏడో స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత కెనడా, బ్రెజిల్ దేశాలు తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి. దేశాల అప్పులను జీడీపీతో పోల్చి చూస్తే.. జీడీపీకి మించి అప్పులు ఉన్న దేశాల్లో జపాన్ అగ్రస్థానంలో ఉన్నట్లు తేలింది. జపాన్ అప్పుల శాతం ఆ దేశ జీడీపీలో 204 శాతానికి పైగా ఉండగా.. ఆ తర్వాత సింగపూర్, సూడాన్ దేశాలు రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ఇక బహ్రెయిన్, ఇటలీ, గ్రీస్, సెనెగల్, మాల్దీవులు కూడా తమ దేశాల జీడీపీ కంటే ఎక్కువ అప్పులు చేశాయి. అమెరికా విషయానికొస్తే.. ఆ దేశ జీడీపీలో 125 శాతానికి పైగా ఉంగా.. ఉక్రెయిన్ పదో స్థానంలో నిలిచింది.
అమెరికన్ డాలర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి ట్రెజరీ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే జపాన్, సింగపూర్, ఇటలీ, గ్రీస్ వంటి దేశాల కంటే అమెరికా వెనుకబటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే అప్పులు అనేవి దేశాల ఆర్థిక వ్యవస్థలపై విపరీతమైన ఒత్తిడికి కలిగిస్తాయి. దేశాల భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.