కొనుగోలుదారులకు శుభవార్త. ఈ-కామర్స్ ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది. ప్రముఖ వెబ్ సైట్లు అమెజాన్ తో పాటు ఫ్లిప్ కార్ట్ లు అక్టోబర్ మాసంలో ఫెస్టివల్ సేల్స్ ప్రారంభించనున్నాయి. అందులో అమెజాన్ గ్రేట్ ఇండియాన్ ఫెస్టివల్ సేల్ 2023 అక్టోబర్ 10న ప్రారంభం కానుంది. అదే సమయంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్ కార్ట్ కు పోటీగానే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023ని తీసుకొచ్చినట్లు నున్నట్లు టూ టిప్ స్టర్స్ వెల్లడించింది. అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉన్న డీల్స్, డిస్కౌంట్స్, క్యాష్ బాక్స్ అన్నీ కూడా ప్రైమ్ సబ్ స్కైబర్లకు ఒక రోజు ముందుగానే అందుబాటులోకి రానుంది. లీకైన సమాచారం ఎలా ఉన్నా అమెజాన్ వెబ్ సైట్లో ఈ సేల్ కు సంబంధించిన ప్రాథమిక సమాచారం పొందుపర్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కమింగ్ సూన్ అని పోస్టర్ ఉంచింది.
టిప్ స్టర్ ముకుల్ శర్మ(@stufflistings), అభిషేక్ యాదవ్(@yabhishekd) తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అమెజాన్ సేల్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. దీని ప్రకారం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 అక్టోబర్ 10 ప్రారంభవుతుంది. రెండు స్క్రీన్ షాట్లలోనూ ఈ విషయం స్పష్టమైంది. అంతేకాక ఎస్బీఐ కార్డ్ పై కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సేల్ లోని అన్ని ఉత్పత్తులపై ఈ ఆఫర్ వర్తించనుంది.
శర్మ షేర్ చేసిన చిత్రంలో పలు డీల్స్ కు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అవేంటంటే స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఫోన్ల యాక్సెసరీస్ పై 40శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుందని ఉంది. అలాగే పాత ఉత్పత్తుల ఎక్స్ చేంజ్ పై రూ. 60,000 వరకూ తగ్గింపు లభిస్తుందని పేర్కొంది.
మరోవైపు అమెజాన్ విడుదల చేసిన కమింగ్ సూన్ టీజర్ ప్రకారం పలు బ్రాండ్లపై ఆఫర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ నోర్డ్ 3, శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జీ, రెడ్ మీ 12 5జీ వంటి ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉండనున్నట్లు పేర్కొంది. అలాగే పలుస్మార్ట్ వాచ్ లు, ల్యాప్ టాప్ లు, హెడ్ ఫోన్లు వంటి వాటిపై 75శాతం వరకూ డిస్కౌట్లు లభించనున్నాయి.
లీకైన విషయాలు ఎలా ఉన్నా.. సేల్ ఎప్పుడు ప్రారంభమవుతున్నా.. సేల్ ఉంటుందన్న విషయాన్ని అమెజాన్ తన వెబ్ సైట్లోనే ప్రకటించింది కాబట్టి.. కాబట్టి కొనుగోలు దారులు ముఖ్యంగా టెక్ గ్యాడ్జెట్లు కొనుగోలు చేసే వారికి మాత్రం ఈ ఆఫర్లు సంతోషాన్నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..