Amazon, Flipkart: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన.. డెలివరీల నిలిపివేత

|

Apr 20, 2021 | 9:55 PM

Amazon, Flipkart: దేశ వ్యాప్తంగా కరోనా మహహ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి కేంద్ర,..

Amazon, Flipkart: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన.. డెలివరీల నిలిపివేత
Amazon, Flipkart
Follow us on

Amazon, Flipkart: దేశ వ్యాప్తంగా కరోనా మహహ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ ఆంక్షలు కారణంగా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఢిల్లీలో నాన్‌-ఎసెన్సియల్‌ డెలివరీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మార్పు గురించి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు సమాచారం అందించాయి. ఇంతకుముందు కంపెనీలు మహారాష్ట్రలో ఇలాంటి చర్య తీసుకోవలసి వచ్చిందని పేర్కొన్నాయి. ఢిల్లీలో ఏప్రిల్ 26 సోమవారం వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుంది.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రంగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూలు విధించగా, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు సైతం అమలు చేస్తున్నాయి. మాస్క్‌లు ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తున్నాయి. మాస్క్‌లు లేని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నాయి. తెలంగాణలో ఈ రోజు నుంచి నైట్‌ కర్ప్యూ అమలు అవుతోంది. ఇక ఢిల్లీలో మాత్రం కేసుల సంఖ్య అంతే లేకుండా పోతోంది. పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్‌ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఇవీ చదవండి: SBI Zero Balance: ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేట్లు.. ఉచిత లావాదేవీలు, ఇతర పూర్తి వివరాలు

Postal Charges: పోస్టాఫీసుల్లో కనీస బ్యాలెన్స్‌ ఛార్జీలు తగ్గింపు.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్థిక శాఖ

LIC Paytm: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త… డిజిటల్‌ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం