FD Interest Rates: కస్టమర్లకు ఆ బ్యాంకుల షాక్.. ఎఫ్‌డీలపై భారీగా వడ్డీ రేట్ల తగ్గింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే. దీని ఫలితంగా భారత బ్యాంకులు సంబంధిత రుణ రేట్లు, ఇతర ప్రణాళికల్లో భారీగా తగ్గింపులు చేశారు. ఆర్‌బీఐకు సంబంధించిన 55వ ద్రవ్య విధాన కమిటీ సమావేశం తరువాత గవర్నర్ సంజయ్ మల్హోత్రా జూన్ 6న వినియోగదారుల ధరల సూచిక ద్రవ్యోల్బణం కోసం మధ్యస్థ కాలిక లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో కీలక పాలసీ రేటును 6.00 శాతం నుండి 5.50 శాతానికి తగ్గించారు.

FD Interest Rates: కస్టమర్లకు ఆ బ్యాంకుల షాక్.. ఎఫ్‌డీలపై భారీగా వడ్డీ రేట్ల తగ్గింపు
Fixed Deposits

Updated on: Jun 14, 2025 | 3:41 PM

ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో వేగంగా స్పందించిన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు, రుణ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 10 నుంచి 35 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. అలాగే కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తక్కువ బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లకు అనుగుణంగా మార్పులు చేశాయి. ఈ నేపథ్యంలో ఏ బ్యాంకు ఎంత మేర ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గించిందో? తెలుసుకుందాం. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ తన రేట్లను అన్ని వ్యవధిలకు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సాధారణ పౌరులకు 6.25 శాతానికి, సీనియర్ సిటిజన్లకు ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75 శాతానికి తగ్గింది. ఈ రేట్లు జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఒక సంవత్సరం కాలపరిమితితో ఎఫ్‌డీలపై రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి సాధారణ పౌరులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. 18 నెలల నుంచి రెండేళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.50 శాతానికి తగ్గించింది.

ఇవి కూడా చదవండి

కోటక్ మహీంద్రా బ్యాంక్

కోటక్ మహీంద్రా తన ఒక సంవత్సరం ఎఫ్‌డీ రేట్లను సాధారణ పౌరులకు 25 నుండి 30 బేసిస్ పాయింట్ల వరకు 6.25 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు ఇది 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా అందిస్తుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ జూన్ 12న తన వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ పౌరులకు ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.6 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.1 శాతం రేటును అందిస్తోంది.

ఇండియన్ బ్యాంక్

ఇండియన్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేటును ఒక సంవత్సరం కంటే ఎక్కువ కానీ రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితితో 6.60 శాతానికి తగ్గించింది.

అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు తమ రెపో లింక్డ్ లెండింగ్‌లో తగ్గింపును ప్రకటించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి