ప్రస్తుతం భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఉండే గుర్తింపు కార్డు ఆధార్. ప్రతి అవసరానికి ఆధార్ కార్డు ఆధారమవుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించాాలన్నా, బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్నా, ఏదైనా అప్లికేషన్ పెట్టాలన్నా ప్రతి దానికి ఆధార్ కావాల్సిందే. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఆధార్ కొంతమంది కేటుగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. మనకు తెలియకుండానే ఆధార్ ప్రామాణికతతో అకౌంట్స్ తీసుకోవడం లేదా ఓటీపీ ద్వారా మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేయడం వంటి పనులు చేస్తున్నారు. దీంతో ఎవరికైనా ప్రూఫ్ కింద ఆధార్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఆధార్ అంటే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేసే 12 అంకెల గుర్తింపు సంఖ్య. ఈ సంఖ్యలో మన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. కాబట్టి మన ఆధార్ భద్రపర్చుకోవాల్సిన బాధ్యత మనదే. ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ మీ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారో? లేదో? తెలుసుకోవడానికి ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే సదుపాయాన్ని పౌరులకు కల్పించింది. యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆరు నెలల క్రితం నుంచి ఆధార్ ప్రామాణిక చరిత్రను తెలుసుకునే వెసులుబాటు ఉంది. అలాగే గరిష్టంగా 50 రికార్డులను ఒకేసారి వీక్షించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి