
ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ సర్వీసులకే కాకుండా ప్రైవేట్ సేవలు పొందాలన్నా ఇది తప్పనిసరి అయింది. ఈ కార్డు లేనిది ఏ పని జరగడం లేదు. సిమ్ కార్డు పొందటం దగ్గర నుంచి హోటల్‌లో చెకింగ్ వరకు ప్రతీ పనికి ఆధార్ ఉపయోగపడుతోంది. అందుకే ఆధార్‌ను ఎల్లప్పుడూ మన వెంటే ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే ఆధార్‌ను ఉపయోగించి అనేక మోసాలు కూడా జరుగుతున్నాయి. వీటిని నివారించి ఆధార్‌కు భద్రత కల్పించేందుకు యూఐడీఏఐ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అనేక భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ల ద్వారా మీకు తెలియకుండా మీ ఆధార్ ఎవరైనా ఉపయోగించినా వెంటనే తెలుసుకోవచ్చు. అదెలా అనేది చూద్దాం.
యూఐడీఏఐ తన వెబ్ సైట్, యాప్‌లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ఫీచర్ గతంలో తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఆధార్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారు..? దేని కోసం వినియోగించారు..? ఎప్పుడు ఉపయోగించారు? అనే వివరాలు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. దీని ద్వారా మీకు తెలియకుండా మీ ఆధార్‌ను ఎవరైనా ఉపయోగించి ఉంటే తెలిసిపోతుంది. దీంతో మీరు వెంటనే మీ ఆధార్ బయెమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవడం వల్ల మీరు ఆధార్‌ను వేరేవారు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవచ్చు. ఐరిస్, వేలిముద్రలు, ఓటీపీ వెరిఫికేషన్ వంటి ట్రాక్ రికార్డులను మీరు తెలుసుకోవచ్చు. దీని వల్ల మీ ఆధార్‌ను వేరేవారు ఉపయోగించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
-గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి
-మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి
-హోమ్ పేజీలో మై ఆధార్ అనే ఆప్షన్ ఎంచుకోండి
-మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి
-ఆధార్ అథెంటిఫికేషన్ హిస్టరీ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-మీరు ఏ తేదీలకు సంబంధించిన హిస్టరీని తెలుసుకోవాలనుకుంటున్నారనే వివరాలను సెలక్ట్ చేసుకోండి
-మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడారనే వివరాలు అందుతాయి
ఒకవేళ మీకు తెలియకుండా మీ ఆధార్ ఎక్కడైనా ఉపయోగించినట్లు తెలిస్తే వెంటనే యూఐడీఏఐ హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి. 1947 నెంబర్‌కి ఫిర్యాదు చేయండి. ఇక వెంటనే మీ ఆధార్ బయెమెట్రిక్స్‌ను లాన్ చేసుకోండి. దీని వల్ల మీ ఆధార్‌ను ఇతరులు ఉపయోగించకుండా అడ్డుకోవచ్చు. మీరు ఎప్పటికప్పుడు ఇలా హిస్టరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల మీ ఆధార్ సురక్షితంగా ఉంటుంది.