Income Tax: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆధార్-పాన్ లింక్ అయ్యిందా? లేకుంటే చాలా నష్టం.. వెంటనే చెక్ చేసుకోండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఏప్రిల్ 24న విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో పన్ను చెల్లింపుదారుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని పేర్కొంది. వాటిల్లో పన్ను చెల్లింపుదారుల టీడీఎస్/టీసీఎల్ చెల్లింపుల్లో డిఫాల్ట్ చేసినట్లు నోటీసులు అందాయని తెలియజేశారు. దానికి కారణం వారు పని చేయని పాన్ నంబర్ తో లావాదేవీలను నిర్వహించడమేనని పేర్కొన్నట్లు చెప్పింది.

Income Tax: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆధార్-పాన్ లింక్ అయ్యిందా? లేకుంటే చాలా నష్టం.. వెంటనే చెక్ చేసుకోండి
Aadhaar - Pan Link
Follow us

|

Updated on: Apr 27, 2024 | 4:15 PM

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులు అంతా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే కొంతమంది పన్ను చెల్లింపుదారులు చాలా మంది ఇంకా వారి ఆధార్, పాన్ కార్డు లింక్ చేయలేదు. అలా చేయని వారికి ట్యాక్ డిడక్ట్ ఎట్ సోర్స్(టీడీఎస్) అధికంగా తీసివేస్తారు. అయితే మే 31లోగా  అతని/ఆమె పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసినట్లయితే టీడీఎస్ చాలా స్పల్పంగా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, బయోమెట్రిక్ ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోతే, వర్తించే టీడీఎస్ రేటు కంటే రెట్టింపు పడుతుంది. ఈనేపథ్యంలో పన్ను చెల్లింపు దారులు తప్పనిసరిగా ఆధార్ పాన్ లింక్ చేయాలి. ఈ క్రమంలో ఆధార్, పాన్ ఎలా లింక్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఏప్రిల్ 24న విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో పన్ను చెల్లింపుదారుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని పేర్కొంది. వాటిల్లో పన్ను చెల్లింపుదారుల టీడీఎస్/టీసీఎల్ చెల్లింపుల్లో డిఫాల్ట్ చేసినట్లు నోటీసులు అందాయని తెలియజేశారు. దానికి కారణం వారు పని చేయని పాన్ నంబర్ తో లావాదేవీలను నిర్వహించడమేనని పేర్కొన్నట్లు చెప్పింది. ఈ క్రమంలో అటువంటి ఫిర్యాదులను పరిష్కరించడానికి, సీబీడీటీ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేంటంటే మార్చి 31, 2024 వరకు నమోదు చేసిన లావాదేవీల కోసం మే 31 లేదా అంతకు ముందు పాన్-ఆధార్‌తో అనుసంధానం చేసుకొని పాన్ కార్డు ఆపరేటివ్ అయ్యేటట్లు చేస్తే అప్పుడు వారికి ఎలాంటి డిఫాల్ట్ ఉండదని పేర్కొంది. మీరు ఇప్పటికీ మీ పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఆదాయ పన్ను శాఖ పోర్టల్ ద్వారా లింక్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

  • ఐటీ విభాగానికి చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్ ల్లోకి వెళ్లాలి.
  • వెబ్‌పేజీలోని ‘క్విక్ లింక్స్’ విభాగంలోని ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఇది మిమ్మల్ని కొత్త పేజీకి దారి మళ్లిస్తుంది. ఇక్కడ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పేరు వంటి ఇతర అవసరమైన వివరాలు నమోదు చేయాలి.

ఎస్ఎంఎస్ ద్వారా లింక్..

  • ఎస్ఎంఎస్ పంపడానికి మొబైల్ పరికరంలో 567678 లేదా 56161కి డయల్ చేయండి. ఫార్మాట్ తప్పనిసరిగా UIDPAN (10-అంకెల పాన్ కార్డ్ నంబర్, 12-అంకెల ఆధార్ కార్డ్ నంబర్) స్పేస్ ఉండాలి.
  • మీకు పాన్-ఆధార్ లింక్ స్థితిని ఓ ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది.
  • పన్ను చెల్లింపుదారుల పుట్టిన తేదీ రెండు డాక్యుమెంట్లతో సరిపోలితే మాత్రమే ఆధార్, పాన్ లింక్ చేయబడతాయి.

మీ పాన్, ఆధార్ కార్డ్ ఇప్పటికే లింక్ చేయబడి ఉందో లేదో తనిఖీ చేయడం ఎలా?

  • ఆదాయపు పన్ను శాఖ అధికారిక సైట్‌కి వెళ్లండి .
  • క్విక్ లింక్స్ ఎంపికపై క్లిక్ చేయండి. అక్కడ, మీరు ‘లింక్ ఆధార్ స్టేటస్’ని చెక్ చేయడానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దానిపై క్లిక్ చేయాలి.
  • దీని తర్వాత, మీరు మీ కంప్యూటర్ లేదా మొబైల్‌లో కొత్త స్క్రీన్‌ని చూస్తారు. ఇక్కడ, మీరు మీ పాన్, ఆధార్ నంబర్లను నమోదు చేయాలి.
  • మీరు వివరాలను పూరించిన తర్వాత, ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్’పై క్లిక్ చేయండి. మీ ఆధార్-పాన్ స్టేటస్ కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..