MX Moto E-Bike: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న నయా ఈ-బైక్.. ఫీచర్లు తెలిస్తే షాకవుతారంతే..!

|

Jun 28, 2023 | 4:45 PM

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల ద్విచక్ర వాహనాలకు ఎఫ్ఏఎంఈఐఐ రాయితీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మార్కెట్‌లో ఈవీ వాహనాల జోరు తగ్గడం లేదు. రోజురోజుకూ ఈ మార్కెట్‌లో కొత్త కంపెనీల రాక ఈవీ వాహనాల భవిష్యత్ ఎలా ఉంటుందో? తెలియజేస్తుంది. ఎంఎక్స్ 9 ఈ-బైక్‌ను యూరప్‌కు చెందిన ప్రఖ్యాత మోటార్‌సైకిల్ డిజైనర్ మార్సెల్లో సిల్వా రూపొందించారు.

MX Moto E-Bike: మార్కెట్‌లోకి దూసుకొస్తున్న నయా ఈ-బైక్.. ఫీచర్లు తెలిస్తే షాకవుతారంతే..!
Mx Moto
Follow us on

భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఈవీ విప్లవం కొనసాగుతుంది. స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకూ తమ కంపెనీ తరఫును ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈవీ ల్యాండ్‌స్కేప్‌లో కొత్తగా ప్రవేశించిన ఢిల్లీ ఆధారిత ఎంఎక్స్ మోటో తన తొలి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎంఎక్స్ 9ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల ద్విచక్ర వాహనాలకు ఎఫ్ఏఎంఈఐఐ రాయితీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మార్కెట్‌లో ఈవీ వాహనాల జోరు తగ్గడం లేదు. రోజురోజుకూ ఈ మార్కెట్‌లో కొత్త కంపెనీల రాక ఈవీ వాహనాల భవిష్యత్ ఎలా ఉంటుందో? తెలియజేస్తుంది. ఎంఎక్స్ 9 ఈ-బైక్‌ను యూరప్‌కు చెందిన ప్రఖ్యాత మోటార్‌సైకిల్ డిజైనర్ మార్సెల్లో సిల్వా రూపొందించారు. కంపెనీ తెలిపిన వివరాలప్రకారం గురుగ్రామ్‌లో సుమారు 4,000 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసే వార్షిక సామర్థ్యంతో తయారీ సౌకర్యాన్ని కలిగి ఉంది. అలాగే ఈ ఈ-బైక్ ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించింది. ఈ నయా ఈ-బైక్ ఫీచర్లు స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేద్దాం.

ఎంఎక్స్ 9 ఫీచర్లు ఇవే

ఎమ్‌ఎక్స్‌మోటో త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఎంఎక్స్ 9 భద్రత, పనితీరు రెండింటినీ దృష్టిలో ఉంచుకుని రూపొందించామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ బైక్ 17 అంగుళాల పెద్ద చక్రాలు, 60 ఏఎంపీ కంట్రోలర్, రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను కలిగి ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అవుట్‌పుట్ పవర్‌లో 16 శాతం పెరుగుదలతో ఇది అధిక స్థాయి పనితీరుతో వస్తుంది. ఎంఎక్స్ మోటో  ఎలక్ట్రిక్ వాహనాలు లైఫ్ పీఓ4 బ్యాటరీ టెక్నాలజీతో ఆకట్టుకుంటుంది. అయితే ఎంఎక్స్ మోటో తన కొత్త ఈ బైక్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే డిమాండ్‌కు అనుగుణంగా డీలర్ నెట్‌వర్క్‌తో పాటు ప్రత్యేక షోరూమ్‌లను లాంచ్ చేస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..