Ratan Tata: రతన్ టాటా అభిమానుల్లో ఈ అభిమాని వేరయా..

|

Oct 15, 2024 | 9:33 PM

తన ఛాతీపై రతన్ టాటా టాటూను ఓ అభిమాని వేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో ఆ వ్యక్తి పారిశ్రామికవేత్తను నిజ జీవిత దేవుడిగా ఎందుకు భావిస్తున్నాడనే వీడియోలో క్లియర్‌గా వివరించాడు. కొన్నేళ్ల క్రితం తన స్నేహితుడు క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. పెద్ద ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు ప్రయత్నించామని వెల్లడించారు. అప్పుడు టాటా ట్రస్ట్‌ల వారు ఆదుకొని తన స్నేహితుడికి ఉచిత వైద్య చికిత్స అందించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Ratan Tata: రతన్ టాటా అభిమానుల్లో ఈ అభిమాని వేరయా..
Ratan Tata
Follow us on

తన ఛాతీపై రతన్ టాటా టాటూను ఓ అభిమాని వేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో ఆ వ్యక్తి పారిశ్రామికవేత్తను నిజ జీవిత దేవుడిగా ఎందుకు భావిస్తున్నాడనే వీడియోలో క్లియర్‌గా వివరించాడు. కొన్నేళ్ల క్రితం తన స్నేహితుడు క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. పెద్ద ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు ప్రయత్నించామని వెల్లడించారు. అప్పుడు టాటా ట్రస్ట్‌ల వారు ఆదుకొని తన స్నేహితుడికి ఉచిత వైద్య చికిత్స అందించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఆ వ్యక్తి టాటా ట్రస్ట్‌లు ఎన్నో లెక్కలేనన్ని జీవితాల కాపాడాయాన్ని ఆయన పేర్కొన్నారు. అతని వ్యక్తిగత అనుభవం రతన్ టాటా సూత్రాలను అనుసరించడానికి తనను ఎలా ప్రేరేపించిందో తెలిపాడు. తాను రతన్ టాటాను “నిజ జీవిత దేవుడు”గా చూస్తానని చెప్పాడు. భారతదేశం ఓ లెజెండ్‌ను కోల్పోయిందని క్యాప్షన్ పెట్టి వీడియోను ఆ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అప్పటి నుంచి ఈ వీడియో 989,000 కంటే ఎక్కువ లైక్‌లను, 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను పొందింది.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. “జీరో హేటర్స్ ఉన్న వ్యక్తి రతన్ టాటా” అని ఒక్కరు కామెంట్ చేశారు. “భారతదేశం తన రతన్ (రత్నం)ని కోల్పోయింది” అని మరోకరు కామెంట్ చేశారు. “రతన్ టాటా నిజమైన పెద్దమనిషి” అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “మేము నిజమైన కోహినూర్‌ను కోల్పోయాము” అని మరొకరు జోడించారు. రతన్ టాటా ఈ నెల 8న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతని మరణం భారతీయ వ్యాపార రంగం జీర్ణించుకోలేక పోయింది.

వైరల్ అవుతున్న వీడియో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి