EV Scooters: ఫోన్ ధరలోనే సరికొత్త ఈవీ స్కూటర్.. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్కూటర్ గురించి తెలుసుకోండి

|

Apr 22, 2023 | 4:30 PM

అయితే ఆ ఈవీ వాహనాల ధరలు బాగా ఎక్కువగా ఉండడంతో ఓ స్థాయి ప్రజల వరకూ మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఉజాస్ ఈజీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉజాస్ ఈజెడ్‌వై పేరుతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ అందరికీ అందుబాటు ధరలోనే కంపెనీ లాంచ్ చేసింది.

EV Scooters: ఫోన్ ధరలోనే సరికొత్త ఈవీ స్కూటర్.. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్కూటర్ గురించి తెలుసుకోండి
Ujass
Follow us on

భారతదేశంలో ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా వాహనదారులు ఈవీ వాహనాల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. వినియోగదారుల నుంచి అమాంతంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా చాలా కంపెనీలు సరికొత్తగా ఈవీ వాహనాలను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. బైక్స్, కార్లతో పోలిస్తే కంపెనీలు ఎక్కువగా స్కూటర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఆ ఈవీ వాహనాల ధరలు బాగా ఎక్కువగా ఉండడంతో ఓ స్థాయి ప్రజల వరకూ మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఉజాస్ ఎనర్జీ కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉజాస్ ఈజెడ్‌వై పేరుతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ అందరికీ అందుబాటు ధరలోనే కంపెనీ లాంచ్ చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో 50 కంటే ఎక్కువ కంపెనీలు ఈవీ వాహనాలను అందిస్తున్నాయి. ఆయా కంపెనీలు ఇచ్చే ధర కంటే తక్కువ ధరకే ఉజాస్ స్కూటర్లను అందిస్తుంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేని ఈ స్కూటర్ గురించి ఇతర వివరాలు ఏంటో సారి చూద్దాం.

బ్యాటరీ, రేంజ్

ఉజాస్ ఎలక్ట్రిక్ కంపెనీ ఈ స్కూటర్‌లో 60వీ/26ఏహెచ్ బ్యాటరీ, 250 డబ్ల్యూ మోటార్‌ను అందించింది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 20 కిలోమీటర్లు. వినియోగదారుడు ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 60 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ తక్కువ శ్రేణి ఈవీ ఆఫీసు, కళాశాలకు వెళ్లే వారికి అనువుగా ఉంటుంది.

అదిరిపోయే ఫీచర్లు ఇవే

తక్కువ బడ్జెట్ఈవీలో ఉజాస్ కంపెనీ చాలా ఫీచర్లను అందించింది. ఉజాస్ ఈజెడ్‌వై ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఓడో మీటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ డిస్‌ప్లే, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ లైట్, యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్, కీలెస్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే రైడింగ్ రివర్స్ డ్రైవింగ్ గేర్ వంటి అనేక ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

అతి తక్కువ ధర

ఉజాస్ ఈజెడ్‌వై ద్విచక్ర వాహనం మొత్తం ధర రూ. 31,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ ప్రతినిధులు చెబతున్నారు. కంపెనీ కస్టమర్ల కోసం ప్రత్యేక ఫైనాన్స్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. తద్వారా కస్టమర్లు పూర్తిగా ఈవీని కొనుగోలు చేసే భారాన్ని భరించాల్సిన అవసరం లేదు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..