Investment Schemes: ఆ పథకాల్లో పెట్టుబడితో మీ పిల్లలకు బంగారు భవిష్యత్.. టాప్-6 స్కీమ్స్ ఇవే..!

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నత భవిష్యత్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే తమకు కష్టమైన మంచి పాఠశాలల్లో చదివిస్తూ వారికి ఇష్టమైన రంగంలో వెళ్లడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే వారి ఉన్నత చదువుల సమయానికి పెద్ద మొత్తంలో సొమ్ము అవసరం అవుతుంది. ఇలాంటి ఖర్చుల కోసం పిల్లల చిన్నతనం నుంచే పొదుపు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

Investment Schemes: ఆ పథకాల్లో పెట్టుబడితో మీ పిల్లలకు బంగారు భవిష్యత్.. టాప్-6 స్కీమ్స్ ఇవే..!
Child Schemes

Updated on: Jun 21, 2025 | 3:30 PM

పిల్లలకు ఉన్న భవిష్యత్‌ను ప్లాన్ చేసుకునే వారు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఉన్నత చదువుల వయస్సు వచ్చే సరికి పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని పేర్కొంటున్నారు. సాధారణంగా రోజు రోజుకూ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ముందుగానే పెట్టుబడి ప్రారంభించడం వల్ల మీ డబ్బు పెరగడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. ముఖ్యంగా ముందస్తు ప్రణాళికలతో మీ కలలను సాకారం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే పథకాలు మంచి రాబడినిస్తాయో? ఓ సారి తెలుసుకుందాం. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 

పీపీఎఫ్ అనేది స్థిరమైన రాబడి, పన్ను ప్రయోజనాలతో కూడిన సురక్షితమైన, దీర్ఘకాలిక ఎంపికగా ఉంటుంది. ఈ పథకంలో 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే కాంపౌండ్డ్ వడ్డీ ద్వారా బలమైన పొదుపును నిర్మించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

సుకన్య సమృద్ధి యోజన 

మీకు ఒక కుమార్తె ఉంటే దీర్ఘకాలిక పొదుపు కోసం ఒక సుకన్య సమృద్ధి యోజన చాలా మంచి పథకంగా ఉంటుంది. ఇది మంచి వడ్డీ రేట్లతో పాటు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఈ స్కీమ్ 21 సంవత్సరాల తర్వాత లేదా అమ్మాయి వివాహం చేసుకున్నప్పుడు మెచ్యూర్ అవుతుంది. 

ఇవి కూడా చదవండి

చైల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ 

బీమా కంపెనీలు అందించే ఈ పథకాలు విద్య లేదా వివాహం వంటి లక్ష్యాలను చేరుకోవడానికి రూపొందించారు. అవి జీవిత బీమా, పరిపక్వత ప్రయోజనాన్ని అందిస్తాయి. అలాగే మీకు ఏదైనా జరిగినా మీ పిల్లల అవసరాలు తీర్చేలా ఈ స్కీమ్స్ రూపొందించారు. 

మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్ ఇటీవల కాలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి అయితే ఈ స్కీమ్స్ మార్కెట్ పనితీరు ఆధారంగా అధిక రాబడిని అందిస్తాయి. మీరు ఈక్విటీ (దీర్ఘకాలిక వృద్ధికి), డెట్ (తక్కువ రిస్క్) లేదా హైబ్రిడ్ ఫండ్స్ (రెండింటి మిశ్రమం) నుంచి ఎంచుకోవచ్చు. SIPలు మీరు చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి. ఇవి కాలక్రమేణా పెరుగుతాయి.

యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్

యూలిప్‌లు పెట్టుబడి, జీవిత బీమాను మిళితం చేసి వచ్చే పెట్టుబడి పథకం. మీ డబ్బులో కొంత భాగం మార్కెట్లో పెట్టుబడి పెట్టబడుతుంది. మరికొంత భాగం బీమా కోసం ఉపయోగిస్తారు. అవి పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. ఈక్విటీ లేదా డెట్ ఫండ్ల మధ్య ఎంచుకునే అవకాశాన్ని మీకు అందిస్తాయి.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 

ఈ స్కీమ్ ఇది తక్కువ-రిస్క్ పెట్టుబడి ఎంపికగా ఉంటుంది. ఐదేళ్ల తర్వాత స్థిర రాబడిని ఇస్తుంది. మీరు హామీతో కూడిన రాబడితో పాటు తక్కువ రిస్క్‌ ఉండే పెట్టుబడి స్కీమ్‌ను ఇష్టపడితే ఈ స్కీమ్ సురక్షితమైన ఎంపికగా ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి