Viral Photo: ఫోటోలోని ప్రముఖ వ్యాపారవేత్తను గుర్తుపట్టారా..? మీ మెదడుకు మేత..

Viral Photo: ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తుపట్టారా..? ఆయన ప్రస్తుతం దేశంలో ఒక ప్రఖ్యాత వ్యాపార వేత్త. తన దృష్టికి వచ్చే సమాజంలోని అనేక అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు.

Viral Photo: ఫోటోలోని ప్రముఖ వ్యాపారవేత్తను గుర్తుపట్టారా..? మీ మెదడుకు మేత..
Viral Image

Updated on: Mar 11, 2022 | 8:40 AM

Viral Photo: ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తుపట్టారా..? ఆయన ప్రస్తుతం దేశంలో ఒక ప్రఖ్యాత వ్యాపార వేత్త. తన దృష్టికి వచ్చే సమాజంలోని అనేక అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ఆయన ట్విట్టర్ ఖాతా ఒక విజ్ఞాన ఘని.. ఎందుకంటే సామాజిక మాధ్యమాలను సమాజహితం కోసం వినియోగించటంలో ఆయనకు మరొకరు సాటిరారు అనటంలో అనుమానమే లేని అంశం. ఆయనే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra). 17 ఏళ్ల ప్రాయంలోని అలనాటి తన పాత చిత్రాన్ని ట్విట్టర్ వేధికగా ఆయన షేర్ చేసుకున్నారు. 1972 నాటి ఆ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో మళ్లీ వైరల్ గా మారింది.

Anand Mahindra

1972 కాలంలో 17 ఏళ్ల ప్రాయంలో తన వారాంతపు విరామాన్ని ఎంత సంతోషంగా గడిపేవారనే విషయాన్ని మహేంద్రా తన త్రోబ్యాక్ పిక్ ద్వారా పంచుకున్నారు. తన స్నేహితుడితో కలిసి తరచూ ముంబయి నుంచి పుణెకి ట్రక్కులపై ప్రయాణించేవాళ్లమని ఆయన తెలిపారు. బహుశా బహిరంగ రహదారిపై విహరిస్తూ ప్రేమను పెంపొందించుకున్నానని వెల్లడించారు. ‘పరిచయ్’ సినిమా లోని ‘ముసాఫిర్ హూన్ యారోన్’ అనే పాట పాడుతూ గడిపిన రోజులను తిరిగి గుర్తు చేసుకున్నారు మహీంద్రా బాస్.

ఇవీ చదవండి..

Travel Alert: విమాన ప్రయాణికులకు శుభవార్త.. 40% తగ్గనున్న విమాన ఛార్జీలు..

Multibagger Returns: ఏడాదిలో లక్షను.. రెండు లక్షలు చేసిన స్టాక్.. అందులోనూ టాటాలు వాటాలు కొన్న షేర్..