PM Modi: రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల అత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందిః ప్రధాని మోదీ

Updated on: Jan 29, 2026 | 10:56 AM

గురువారం 2026 బడ్జెట్ సెషన్‌లో రెండవ రోజు ప్రారంభమైంది. లోక్‌సభలో ఇవాళ ఆర్థిక సర్వేను ప్రస్తాస్తారు. దీనిలో ప్రభుత్వ ఖర్చులోని ప్రతి పైసా లెక్కించడం జరగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వేను సభలో ప్రతిపాదిస్తారు. ఇది GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, వ్యవసాయం సహా వివిధ రంగాల పనితీరు, ఎగుమతుల్లో పెరుగుతున్న బలాన్ని ప్రస్తావించవచ్చు.

గురువారం 2026 బడ్జెట్ సెషన్‌లో రెండవ రోజు ప్రారంభమైంది. లోక్‌సభలో ఇవాళ ఆర్థిక సర్వేను ప్రస్తాస్తారు. దీనిలో ప్రభుత్వ ఖర్చులోని ప్రతి పైసా లెక్కించడం జరగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వేను సభలో ప్రతిపాదిస్తారు. ఇది GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, వ్యవసాయం సహా వివిధ రంగాల పనితీరు, ఎగుమతుల్లో పెరుగుతున్న బలాన్ని ప్రస్తావించవచ్చు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. కానీ ఈసారి దానిని రెండు రోజుల ముందు లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసానికి ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దేశప్రజల సామర్థ్యం, వారి ఆకాంక్షలకు, ముఖ్యంగా యువత స్పూర్తికి నిదర్శనమని అన్నారు. “పార్లమెంటు సభ్యులకు, దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి రాష్ట్రపతి అనేక విషయాలు చెప్పారు. రాష్ట్రపతి వ్యక్తం చేసిన అంచనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది. ఎంపీలు అందరు రాష్ట్రపతి ప్రసంగానికి సంతృప్తితో ఉన్నారని నమ్మకంగా ఉంది..” అని ప్రధాని మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..