PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించకుండా ఉండాల్సింది: ప్రధాని మోదీ

|

Feb 08, 2021 | 11:19 AM

PM Narendra Modi on President's Address: భారత్ అభవృద్ధి పథంలో దూసుకెళ్తూ.. కొత్త అవకాశాలకు నిలయంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన..

PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించకుండా ఉండాల్సింది: ప్రధాని మోదీ
Follow us on

PM Narendra Modi on President’s Address: భారత్ అభవృద్ధి పథంలో దూసుకెళ్తూ.. కొత్త అవకాశాలకు నిలయంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాజ్యసభలో ప్రసంగించారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించిన మోదీ.. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే ఆదర్శమని కొనియాడారు. ఈ సమావేశాల్లో 50 మంది సభ్యులు సుధీర్ఘ చర్చల్లో పాల్గొని అమూల్యమైన అభిప్రాయాలను చెప్పారని మోదీ పేర్కొన్నారు. కానీ రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించకుండా ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆయన తెలిపారు. కరోనా సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా ఎదుర్కొందని మోదీ తెలిపారు. ఈ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని ప్రధాని వెల్లడించారు.

Also Read:

Uttarakhand Glacier Outburst: ‘ఉత్తర’ ప్రళయం, మూడు వేల కోట్లు నీళ్ల పాలు ! వరదల్లో తుడిచిపెట్టుకుపోయిన తపోవన్ డ్యామ్

తమిళనాడులో పొలిటికల్ టెన్షన్.. బెంగళూరు నుంచి చెన్నైకి బయలుదేరిన జయలలిత నెచ్చెలి శశికళ..