Budget 2021: బడ్జెట్‌లో ఊరట కల్పించండి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సినీ ప్రతినిధులు

|

Jan 23, 2021 | 6:04 PM

Budget 2021: బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో ...

Budget 2021: బడ్జెట్‌లో ఊరట కల్పించండి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సినీ ప్రతినిధులు
Follow us on

Budget 2021: బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌ నేతృత్వంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశం అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు మంత్రిని కోరారు. కోవిడ్‌-19తో దెబ్బతిన్న మల్టిప్లెక్స్‌, సినీ పరిశ్రమలకు ఊరట కల్పించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మల్టీప్లెక్స్‌ కంపెనీల ప్రతినిధులు కోరారు.

కాగా, సినీ పరిశ్రమ వినతులను పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు సినీ విశ్లేషకులు, ట్రేడ్‌ అనలిస్ట్‌ తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా సుదీర్ఘ కాలంగా లాక్‌డౌన్‌ విధించడంతో సినీ ఇండస్ట్రీ భారీగా నష్టాల్లో కూరుకుపోయిందని, బడ్జెట్‌లో ఇండస్ట్రీకి మేలు జరిగేలా చూడాలని ప్రతినిధుల బృందం ఆర్థిక మంత్రిని కోరారు.

Also Read: బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు అనాదిగా వస్తోన్న ఆనవాయితీ, పార్లమెంట్‌లో హల్వా వేడుకను ప్రారంభించిన నిర్మలా సీతారామన్