Budget 2023: రైల్వే ప్రయాణికులకు మోదీ ప్రభుత్వం తీపికబురు.. బడ్జెట్‌ 2023లో 500 కొత్త వందే భారత్ రైళ్లు, హైడ్రోజన్-ఆధారిత రైళ్లతోపాటు..

|

Jan 19, 2023 | 3:18 PM

యూనియన్ బడ్జెట్‌లో రైల్వే కేటాయింపు దాదాపు రూ. 1.9 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేయబడింది. ఇది 500 కొత్త వందే భారత్ రైళ్లు, హైడ్రోజన్-ఆధారిత రైళ్లతోపాటు మరిన్ని ఇతర ఆధునికీకరించిన రైల్వే కోచులను తీసుకొచ్చేందుకు బడ్జెట్‌కి రానున్నాయి. ఇలా రానున్న బడ్జెట్‌లో రైల్వేలకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేయనుంది.

Budget 2023: రైల్వే ప్రయాణికులకు మోదీ ప్రభుత్వం తీపికబురు.. బడ్జెట్‌ 2023లో 500 కొత్త వందే భారత్ రైళ్లు, హైడ్రోజన్-ఆధారిత రైళ్లతోపాటు..
Indian Railways Hydrogen Train
Follow us on

యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌..! వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మరిన్ని దూసుకురానున్నాయి. అవును ఇది నిజం.. దేశానికే తలమానికంగా భావిస్తున్న వందేభారత్‌ వివిధ రాష్ట్రాలను కలుపుతూ పరుగులు తియ్యబోతున్నాయి. రవాణా రంగానికి కేంద్ర బడ్జెట్ పెద్ద పీట వేస్తోంది. ముఖ్యంగా రైల్వే వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు చర్యలు చేపడుతోంది. అలాగే ప్రయాణికుల కోసం పలు కొత్త ట్రైన్లను తీసుకోస్తోంది. మరింత బడ్జెట్‌ రైల్వేకు బూస్టప్‌నిచ్చేదుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. రైల్వేలకు కొత్త ఊపు నిచ్చేందుకు భారీ ఎత్తున బడ్జెట్‌ను కేటాయిస్తోంది మోదీ సర్కార్. 2023-24 బడ్జెట్‌లో భారతీయ రైల్వేకు దాదాపు రూ. 1.9 లక్షల కోట్లు (23 బిలియన్ డాలర్లు) కేటాయించే అవకాశం ఉందని సమాచారం.

మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఊతం ఇస్తుందని భావిస్తున్నారు. వందే భారత్ మరో 500 సెమీ-హై స్పీడ్ రైళ్లను ఫ్లీట్‌కు జోడించాలని, 35 హైడ్రోజన్-ఇంధన రైళ్లను కార్డ్‌లలో చేర్చాలని ప్రతిపాదించారు.

వందే భారత్ రైళ్లు..

దేశంలో సెమీ బుల్లెట్‌ రైలుగా గుర్తింపు పొందిన వందేభారత్‌ రైళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. రెండు కారణాల వల్ల వందే భారత్ కోసం ఒత్తిడి చేస్తోంది. ఒకటి అన్ని రాజధానిలు, శతాబ్దిలను వందే భారత్‌తో భర్తీ చేయాలని భావిస్తోంది. అంతేకాదు ఇప్పుడు తిరుగుతున్న రూట్లలో సగటు వేగాన్ని గంటకు 180 కి.మీకు పెంచడం. రెండవది- 2025-26 నాటికి యూరప్, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాలోని మార్కెట్‌లకు ఈ రైళ్లను ఎగుమతి చేయాలని కూడా మోదీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీంతో విదేశీ మారకద్రవ్యంను భారీగా పెంచాలనేది మోదీ సర్కార్ యోచిస్తోంది.

వందే భారత్ విస్తరణతో పాటు.. కొత్తగా రూపొందించిన 4వేల ఆటోమొబైల్ క్యారియర్ కోచ్‌లు, 58వేల వ్యాగన్‌లను కూడా రాబోయే బడ్జెట్‌లో ప్రకటించి.. వచ్చే 3 ఏళ్లలో విడుదల చేయనున్నారు.

హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు..

కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన శక్తి వనరుగా హైడ్రోజన్ ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అందుకే ప్రకృతి శక్తితో నడిచే రైళ్లపై ప్రపంచ దేశాలు ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటి వరకు జర్మనీ మాత్రమే హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను అభివృద్ధి చేసింది. ఈ సంవత్సరం జర్మనీ ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌తో నడిచే ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించింది. భారత్ సైతం హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది నుంచి వందేభారత్ రైళ్లతోపాటు హైడ్రోజన్ రైళ్లు సైతం సిద్ధమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో వెళ్లడించారు. హైడ్రోజన్, ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్‌ను రైలు ఇంధనంగా ఉపయోగించడం వల్ల జీరో కార్బన్ లక్ష్యాలకు మద్దతు ఇవ్వడంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయని ఆయన వెళ్లడించారు.

ఇటీవల, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎనిమిదింటిలో హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను నడిపించే ప్రణాళికలను వెల్లడించారు. హెరిటేజ్ రైల్వే రూట్లుగా పేరున్న డార్జిలింగ్, నీలగిరి, కల్కా-సిమ్లా, కాంగ్రా వ్యాలీ. హర్యానాలోని సోనిపట్-జింద్ సెక్షన్‌లో టెస్ట్ రన్ చేయనున్నారు. నార్తర్న్ రైల్వే వర్క్‌షాప్‌లో ఈ మార్గాల కోసం ఒక నమూనా అభివృద్ధి చేయబడుతోంది. ఈ రైళ్లు కొండలపై రైలు ప్రయాణాన్ని సున్నా కార్బన్ ఉద్గార ఎంపికగా మారుస్తాయని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.

రోలింగ్ స్టాక్..

కొత్త యుగం రోలింగ్ స్టాక్ (రైళ్లు, కోచ్‌లు, వ్యాగన్‌లు)పై భారీ థ్రస్ట్ ఉంటుంది. ఇది ఇప్పటివరకు అత్యధికం. రైల్వే రోలింగ్ స్టాక్‌ను ఆధునీకరించడంతోపాటు ప్లాన్ కింద అప్‌గ్రేడ్ చేస్తారు. ప్రభుత్వం 100 కొత్త విస్టాడోమ్ కోచ్‌లు, ప్రీమియర్ రైళ్ల 1000 కోచ్‌ల పునరుద్ధరణను కూడా ప్లాన్ చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం