Agriculture Budget 2021: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను ఈరోజు ప్రవేశపెడుతోంది. అయితే రైతులను ఆకర్షించడానికి మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుందని సమచారం. ఇప్పటికే వ్యవసాయ రంగంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది. ఈ పథకం ద్వారా కేంద్రం తొలిసారిగా ఏటా రూ. 6వేలను మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. ఈ మొత్తాన్ని మరింత పెంచాలని చాలా కాలంగా రైతు సంఘాలు, నిపుణులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ సాయాన్ని పెంచితే రైతులకు మరింత లాభం చేకూరడంతోపాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
పిఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులందరికీ ఈ పథకం ద్వారా రూ.6000లను.. రూ.2వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని 11.52 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. దాదాపు ఏడు విడతల్లో ప్రభుత్వం నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసింది. 2021-22 బడ్జేట్‌లో మోదీ ప్రభుత్వం ఈ సాయాన్ని మరింత పెంచే అవకాశముందని తెలుస్తోంది.
Also Read: