పాక్ భూభాగం నుంచి అంతర్జాతీయ సరిహద్దుల్లో 100 మీటర్ల సొరంగం, భారత గస్తీ దళాల సెర్చ్ లో బయటపడిన వైనం

జమ్మూ కాశ్మీర్ లోని హీరానగర్ సెక్టార్ లో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా 100 మీటర్ల టనెల్ ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కనుగొంది.

పాక్ భూభాగం నుంచి అంతర్జాతీయ సరిహద్దుల్లో  100 మీటర్ల సొరంగం, భారత గస్తీ దళాల సెర్చ్ లో బయటపడిన వైనం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2021 | 3:20 PM

జమ్మూ కాశ్మీర్ లోని హీరానగర్ సెక్టార్ లో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా 100 మీటర్ల టనెల్ ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కనుగొంది. జమ్మూ డివిజన్ సాంబా జిల్లా సమీపంలోని బోబియాన్ గ్రామంలో జవాన్లు బుధవారం సెర్చ్ చేస్తుండగా ఈ సొరంగ మార్గాన్ని కనుగొన్నారు. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ఉగ్రవాదులను తరలించేందుకు ఈ రహస్య సొరంగాన్ని తవ్వినట్టు భావిస్తున్నారు. రెండు నెలల క్రితమే ఇదే జిల్లాల్లో 150 మీటర్ల సొరంగాన్ని కనుగొన్నారు. ఈ మార్గం ద్వారా కాశ్మీర్ లోకి చొరబడిన నలుగురు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. తాజాగా కనుగొన్న టనెల్ ప్రాంతాన్ని ఉన్నత సైనికాధికారులు సందర్శించారు. అక్కడ నిఘాను మరింత పెంచారు. ఇటీవల ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో కురిసిన హిమపాతం కూడా పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబడడానికి అవకాశం కల్పిస్తోందని సైనికవర్గాలు పేర్కొన్నాయి.  తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా భారత భద్రతా దళాల నిఘా తగ్గుతుందని భావించిన టెర్రరిస్టులు ఇదే అదనని దొంగచాటుగా చొరబడే అవకాశం ఉందని, కానీ వారి ఆటలు సాగబోవని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read :బెలూచిస్తాన్ లోని గ్వాడార్ లో చైనా సైనిక స్థావర నిర్మాణం, యాక్టివిస్టుల ఆందోళన, మీడియా సైతం అభ్యంతరం, Read Also:బ్రహ్మోస్ క్షిప‌ణి ప్రయోగం విజయవంతం… 300 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిన క్షిప‌ణి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో