వరకట్న దాహానికి మరో అబల బలి..!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, వరకట్నం దురాచారం సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. వరకట్న పిశాచికి మరో అబల బలైంది. తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో కట్నం వేధింపులు భరించలేక మరో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. హర్షగూడకు చెందిన రామవత్ రోజా( 25) అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

వరకట్న దాహానికి మరో అబల బలి..!

Updated on: Jul 19, 2020 | 8:37 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, వరకట్నం దురాచారం సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. వరకట్న పిశాచికి మరో అబల బలైంది. తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో కట్నం వేధింపులు భరించలేక మరో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. హర్షగూడకు చెందిన రామవత్ రోజా( 25) అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇదంతా కట్టుకథ అని. భర్తనే రోజాను దారుణంగా హింసించి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని రోజా తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. భర్తపై హత్య కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు రోజా బంధువులు. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us