తెలంగాణకు వెదర్ వార్నింగ్.. రెండ్రోజులు..!

తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే రెండ్రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఆల్ రెడీ...

తెలంగాణకు వెదర్ వార్నింగ్.. రెండ్రోజులు..!
Follow us

|

Updated on: Oct 06, 2020 | 4:51 PM

Weather warning for Telangana state: తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే రెండ్రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఆల్ రెడీ ఒడిశా నుంచి దక్షిణ కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. అక్టోబర్ 9వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నదని, ఈ రెండింటి కారణంగా తెలంగాణకు వర్షసూచన కనిపిస్తోందని వాతావరణ శాఖాధికారి రాజారావు తెలిపారు.

వారం క్రితం వరకు తరచూ కురిసిన వర్షాలతో పలు మార్లు తెలంగాణ జనం ఇబ్బందులకు గురయ్యారు. నాలుగైదు రోజులుగా వర్షాలు లేక ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి వర్షాలకు ఆస్కారం వుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా నుంచి ఒడిశా పరిసర ప్రాంతాల వరకు 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వారు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 9వ తేదీన మరో అల్పపీడనం ఏర్పాడుతుందని, అది 24 గంటల వ్యవధిలో వాయువ్య దిశగా ప్రయాణం చేసి, వాయుగుండంగా మారే అవకాశం వుందని వివరించారు.

మంగళ, బుధవారాల్లో కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.

Also read: అపెక్స్ భేటీలో కీలక నిర్ణయాలు.. షెకావత్ వెల్లడి

Also read: ఢిల్లీలో తెలంగాణ బీజేపీ హల్‌చల్

Also read: Dubbak By-poll: ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ