నటరాజన్‌‌పై ప్రశంసల జల్లు.. రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక బౌలర్‌ అవుతాడన్న కోహ్లీ

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నటరాజన్‌ ను మెచ్చుకున్నారు. నటరాజన్‌ ప్రదర్శనపై గురించి ఎంత మాట్లాడినా తక్కువే అన్నారు.

నటరాజన్‌‌పై ప్రశంసల జల్లు.. రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక బౌలర్‌ అవుతాడన్న కోహ్లీ
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 09, 2020 | 11:12 AM

Natarajan: టీమిండియా బౌలర్‌ నటరాజన్‌ ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమిళనాడు నుంచి టీమిండియాకు ఎంపికైన యార్కర్‌ బౌలర్‌ టి.నటరాజన్‌ ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడారు. 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నటరాజన్‌ ను మెచ్చుకున్నారు. నటరాజన్‌ ప్రదర్శనపై గురించి ఎంత మాట్లాడినా తక్కువే అన్నారు. షమీ, బుమ్రా లాంటి కీలక బౌలర్లు లేకపోయినా నటరాజన్‌ 6 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడని ప్రశంసించారు. నటరాజన్‌ ఇలాగే ఫర్ఫామెన్స్ చేస్తే రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక బౌలర్‌ అవుతాడన్నారు.

ఇక టీ20 మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ హార్దిక్‌ పాండ్యా కూడా ఈ పేసర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విటర్‌లో అతడితో కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేశారు పాండ్యా. నటరాజన్‌.. ఈ సిరీస్‌లో నీ ప్రదర్శన అత్యద్భుతమన్నారు. కఠిన పరిస్థితుల్లో జట్టు తరుఫున అరంగేట్రం చేసి ఇంత గొప్పగా రాణించడం గ్రేట్ అన్నారు. ఆసీస్‌ క్రికెట్‌ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్‌‌ నటరాజన్‌ ను ప్రశంసించారు. నటరాజన్‌ అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నారన్నారు. ఈ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ తన ఫామ్‌ను అలాగే కొనసాగించాలన్నారు. ఇక నటరాజన్‌ ఫామ్‌ చూస్తుంటే షమీ స్థానానికి ఎసరు వచ్చేలా ఉందని సంజయ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలాగే క్రికెట్‌ దిగ్గజాలు ఇయాన్‌ బిషప్‌, టామ్‌ మూడీ సైతం నటరాజ్ ను అభినందించారు.