రాజకీయాల్లోకి విజయ్ దేవరకొండ..! కీలక ప్రకటన చేసిన యాక్టర్

|

Oct 10, 2020 | 3:30 PM

రాజకీయ రంగ ప్రవేశంపై టాలీవుడ్ క్రేజీ యాక్టర్ విజయ్ దేవరకొండ శనివారం కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి వెళ్ళే విషయంపై స్పష్టత నిచ్చిన విజయ్ దేవరకొండ..

రాజకీయాల్లోకి విజయ్ దేవరకొండ..! కీలక ప్రకటన చేసిన యాక్టర్
Follow us on

Vijay Devarakonda political entry: రాజకీయ రంగ ప్రవేశంపై టాలీవుడ్ క్రేజీ యాక్టర్ విజయ్ దేవరకొండ శనివారం కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి వెళ్ళే విషయంపై స్పష్టత నిచ్చిన విజయ్ దేవరకొండ.. రాజకీయాలపైనా, ఓటర్ల తీరుపైనా కీలక కామెంట్స్ చేశారు. దేశంలో పాలిటిక్స్ కంటే డిక్టేటర్‌షిప్‌తో మార్పు వస్తుందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘‘ నేను రాజకీయాల్లోకి రాను.. రాజకీయాలకు వెళ్ళడానికి నాకు ఓపిక లేదు.. పొలిటికల్ సిస్టమ్ అంటేనే సెన్స్ లేదనిపిస్తుంది.. చాలా మంది ఓటు వేయడానికి ఇంట్రెస్టు చూపరు.. డబ్బు కోసం.. చీప్ లిక్కర్ కోసం ఓటు వేసే వాళ్ళున్నారు.. పేద వాళ్ళు, డబ్బున్న వాళ్ళ కంటే మిడిల్ క్లాస్ వాళ్ళే ఈ ట్రాప్‌లో పడుతున్నారు. ఎవరికి ఎందుకు ఓటు వేసున్నామో కూడా తెలియకుండా ఓటు వేసే వాళ్ళని గమనించ వచ్చు.. డబ్బు కోసం.. లిక్కర్ కోసం.. ఓట్లు వేసినన్ని రోజులు ప్రగతి కష్టం.. డిక్టేటర్‌షిప్‌లో అయితే ఛేంజ్ వస్తుంది.. పాలిటిక్స్‌తో ఛేంజ్ రావడం కష్టం అన్నది నా భావన ’’ అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు.

‘‘ దేశాన్ని ఎవరు పాలించాలి అన్నది మనం ఎలా నిర్ణయిస్తాం.. ఓ ఫ్లయిట్ నడిపే పైలట్‌ను అందులో కూర్చున్న పాసింజర్స్ నిర్ణయిస్తారా ? విమానం నడపాలంటే ఎక్స్‌పర్ట్ కావాలి.. ఓ సిస్టమ్ వుంటుంది.. ఇతను పర్‌ఫెక్ట్ అని ఒక వ్యక్తిని డిసైడ్ చేసి, పైలట్‌గా కూర్చోబెడతారు.. పాలిటిక్స్ కూడా అలాగే వుండాలన్నది నా భావన ’’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు విజయ్ దేవరకొండ.

Also read: రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ వార్నింగ్.. అవి ఆపి తీరాల్సిందే!

Also read: బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాలకు వాయు‘గండం‘