ముందస్తు జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ స‌మీక్ష

|

Sep 20, 2020 | 8:41 PM

తెలంగాణలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్‌తో చర్చించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న తరుణంలో అధికారుల‌ను అప్రమ‌త్తం చేయాల‌ని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవ‌స‌ర‌మైన ముందు జాగ్రత్త చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల క‌లెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారుల‌ను సీఎస్ అప్రమ‌త్తం చేశారు. ఈ […]

ముందస్తు జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ స‌మీక్ష
Follow us on

తెలంగాణలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్‌తో చర్చించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్న తరుణంలో అధికారుల‌ను అప్రమ‌త్తం చేయాల‌ని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అవ‌స‌ర‌మైన ముందు జాగ్రత్త చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల క‌లెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారుల‌ను సీఎస్ అప్రమ‌త్తం చేశారు. ఈ రెండు, మూడు రోజులు హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాల‌ని సీఎస్ అధికారుల‌ను ఆదేశించారు. కాగా, కుండ‌పోత వ‌ర్షాల‌కు తెలంగాణ త‌డిసి ముద్దవుతోంది. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు రాష్ర్టంలోని ప్రాజెక్టులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. వాగులు, వంక‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.