ఈ చిన్నారిపేరు అభినందన్..!

| Edited By:

Mar 02, 2019 | 3:38 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం తమిళనాడులో విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చెన్నైలోని ఓ థియేటర్లో పేట 50 రోజుల వేడకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ సతీమణి లత కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె ముగ్గురు పిల్లలకు నామకరణం చేశారు. అందులో ఒక చిన్నారికి పైలట్ అభినందన్ పేరు పెట్టారు. మరో ఇద్దరి శివువులకు పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన తమిళనాడుకు చెందిన అమర వీరుల పేర్లు పెట్టారు. […]

ఈ చిన్నారిపేరు అభినందన్..!
Follow us on

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం తమిళనాడులో విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చెన్నైలోని ఓ థియేటర్లో పేట 50 రోజుల వేడకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ సతీమణి లత కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె ముగ్గురు పిల్లలకు నామకరణం చేశారు. అందులో ఒక చిన్నారికి పైలట్ అభినందన్ పేరు పెట్టారు. మరో ఇద్దరి శివువులకు పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన తమిళనాడుకు చెందిన అమర వీరుల పేర్లు పెట్టారు. దీంతో అక్కడున్న అభిమానులంతా ఒక్కసారిగా కేకుల, కేరింతలతో ఆనందం వ్యక్తం చేశారు. ‘పేట’ సినిమాకి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష హీరోయిన్లగా నటించారు.