ఒడిశాలో ఫొని తీరం దాటింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో తీవ్ర గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ ఉదయం 8గంటల నుంచి ఫొని ప్రభావం ఎక్కువైందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా పూరీలో ఫొని ఉగ్రరూపానికి సంబంధించిన ఓ వీడియోను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు విడుదల చేశారు. అందులో ఫొని బీభత్సాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. ఇదిలా ఉంటే చాలా ప్రదేశాల్లో 150 నుంచి 175కి.మీల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని, భువనేశ్వర్ సహా అనేక చోట్ల వేళ్లతో సహా చెట్లు కూలిపోయాయని, ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని వారు పేర్కొన్నారు.
The sound and the fury : here's what the landfall at Puri by #CycloneFani actually looked like..
Video by @PIBBhubaneswar pic.twitter.com/4GpvKFkRQ3
— PIB India (@PIB_India) May 3, 2019