
శ్రీనగర్ : సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. నిత్యం జమ్ముకశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతూనే ఉన్నారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవేట కొనసాగిస్తొంది భారత ఆర్మీ. ముష్కరులను ఏరిపారేసే పనిలో ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. దీంతో ఉగ్రవాదులు వరుసగా కాల్పులకు తెగబడుతున్నారు. నిన్న కుప్వారాలో కాల్పులు జరిపిన ముష్కరులు.. ఇవాళ షోపియాన్ జిల్లా నాగ్వాల్ లోని 44 రాష్ట్రీయ రైఫిల్స్ కేంద్రం దగ్గర కాల్పులు జరిపారు. ఓ ఆర్మీ శిభిరంపై ఉగ్రవాదులు దాడిచేయడానికి ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వారి దాడులను తిప్పికొట్టాయి. కాగా నాగ్బాల్ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారం ఉన్నట్లు భారత ఆర్మీకి సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. నిన్న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ సీఆర్ఫీఎఫ్ జవాన్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.