Breaking News టెన్త్ పరీక్షలు మళ్ళీ వాయిదా.. ఎప్పటి దాకా అంటే?

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు మళ్ళీ వాయిదా పడ్డాయి. ఈసారి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Breaking News టెన్త్ పరీక్షలు మళ్ళీ వాయిదా.. ఎప్పటి దాకా అంటే?

Edited By:

Updated on: Mar 30, 2020 | 6:00 PM

Tenth class exams postponed once again in Telangana: తెలంగాణలో పదోతరగతి పరీక్షలు మళ్ళీ వాయిదా పడ్డాయి. ఈసారి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని ఉపాధ్యాయుడు బాలకృష్ణ ధాఖలు చేసిన పిటీషన్‌పై హైదరాబాద్ హైకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిటీషన్ ను మరోసారి విచారించిన హైకోర్టు… ప్రస్తుతం వున్న స్టే ను పొడిగించింది.

కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయని కోర్టుకు తెలియజేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దాంతో ప్రస్తుతం కొనసాగుతున్నస్టేను మరోసారి పొడిగించింది హైకోర్టు. ఏప్రిల్ 15 తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి తమ నిర్ణయం చెపుతామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15 కు వాయిదా వేసింది హైకోర్టు.