తెలంగాణా గవర్నర్‌గా తమిళిసై వచ్చి దాదాపు రెండున్నర నెలలు కావస్తోంది. అంతకు ముందున్న గవర్నర్‌ను తరచూ కలుస్తూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తమిళిసై వచ్చిన తర్వాత రాజ్‌భవన్ వైపు పెద్దగా వచ్చింది లేదు. తమిళిసై ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌కు వచ్చిన కెసీఆర్.. ఆ తర్వాత గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కూడా కల్వనేలేదు. ఉన్నట్లుండి సోమవారం రాజ్‌భవన్ బాట పట్టిన కెసీఆర్ వ్యూహమేంటి? ఈ విషయం ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చనీయాంశమైంది.
తమిళనాడులోని నాగర్ కోయిల్‌కు చెందిన డా.తమిళిసై సౌందర్ రాజన్ సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన రోజునే ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ పెద్దల కంటే బిజెపి నేతల హడావిడినే ఎక్కువగా కనిపించింది. ఆ తర్వాత గవర్నర్‌తో కెసీఆర్ భేటీ కాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే అంటే అక్టోబర్ 5న తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది.
సమ్మె ప్రారంభమైన వారం, పది రోజులకు రాజకీయ పక్షాలు, ఆర్టీసీ కార్మిక సంఘాల జెఎసీ ప్రతినిధులు గవర్నర్ జోక్యానికి విఙ్ఞప్తి చేశారు. ఆ తర్వాత బిజెపి నేతలు కూడా గవర్నర్‌ని కలిసి జోక్యం చేసుకుని, ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వాలని కోరారు. అటు కేంద్రంలో హోంశాఖ మంత్రిని కూడా పలువురు తెలంగాణ నేతలు కలిసి జోక్యానికి విఙ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ గవర్నర్ నివేదికను కోరింది. దాంతో తమిళిసై కూడా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను పిలిపించి వివరాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు గ్యాప్ క్రియేట్ అయినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఉన్నట్లుండి కెసీఆర్ గవర్నర్ దగ్గరికి వెళ్ళడంతో కొత్త చర్చ మొదలైంది.
కానీ, ముఖ్యమంత్రి రాజ్‌భవన్ విజిట్‌కు కారణాలు వేరే వున్నాయి. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగంపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో రెవెన్యూ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని తలపెట్టారు ముఖ్యమంత్రి కెసీఆర్. ఈ క్రమంలోనే కొత్త చట్టానికి సంబంధించిన వివరాలను గవర్నర్‌కు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి గవర్నర్‌తో భేటీ అయ్యారని తెలుస్తోంది. కొత్త చట్టానికి శాసనసభ ఆమోదం పొందేందుకు ప్రత్యేక సమావేశాలను ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారు. రెండు లేదా మూడు రోజుల పాటు శాసనసభను డిసెంబర్ నెలలో సమావేశ పరిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం.
ఈ రెండు అంశాలతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెను, రూట్ల ప్రైవేటీకరణ అవసరాన్ని కూడా గవర్నర్‌కు కెసీఆర్ వివరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో త్వరలో టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వివరాలను గవర్నర్‌కు కెసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది.