రేపు రాష్ట్రపతితో భేటీకానున్న టీడీపీ ఎంపీలు

|

Jul 15, 2020 | 8:45 PM

ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారని భావ ప్రకటనా స్వేచ్ఛ హరిస్తున్నారంటూ టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. గురువారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో సమావేశం కావాలని టీడీపీ ఎంపీలు అపాయిమెంట్ కోరారు.

రేపు రాష్ట్రపతితో భేటీకానున్న టీడీపీ ఎంపీలు
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారని భావ ప్రకటనా స్వేచ్ఛ హరిస్తున్నారంటూ టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. గురువారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో సమావేశం కావాలని టీడీపీ ఎంపీలు అపాయిమెంట్ కోరారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని టీడీపీ ఎంపీలు కలువనున్నారు. ఈ సందర్భంగా 13నెలలుగా రాష్ట్రంలో పరిణామాలను రాష్ట్రపతికి ఎంపీలు నివేదించాలని నిర్ణయించారు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ కాలరాయడం, రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయనున్నారు.

రాష్ట్రంలో వైసీపీ నాయకులపై దౌర్జన్యాల గురించి రాష్ట్రపతికి వివరించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా టీడీపీతో సహా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, మానవ హక్కుల ఉల్లంఘణ గురించి రాష్ట్రపతి దృష్టికి టీడీపీ ఎంపీల బృందం తేవాలని భావిస్తున్నారు.