సుప్రీం కోర్టు తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించనున్నామని తెలిపారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. లోక్‌సభలో ఆయన సమాధానమిస్తూ అస్సామీ, బెంగాలీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తెలుగు, తమిళం, ఉర్దూ భాషల్లో సుప్రీం కోర్టు తీర్పులు అనువాదం చేస్తున్నట్టుగా చెప్పారు. దీనికోసం కృత్రిమ మేథస్సును ఉపయోగించేందుకు యోచిస్తున్నామని, ఇందుకోసం ఒక కమిటీని కూడా వేసినట్టుగా మంత్రి తెలిపారు. ఇలా అనువదించిన తీర్పులు వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నట్టుగా చెప్పారు.
కుటుంబ వివాదాలు, సాధారణ సివిల్ కేసులు, వ్యక్తిగత, ఆర్ధిక, కౌలు రైతుల వివాదాలు, కార్మిక , అద్దె ఒప్పందం, వంటివాటిపై వెలువరించిన తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచుతున్నట్టు మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.