పరిష్కారం దిశగా ఆర్టీసీ సమ్మె..!

| Edited By:

Oct 14, 2019 | 4:23 PM

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సమ్మెను పరిష్కరించాల్సిందిగా.. తెలంగాణ సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు కేకేకు సూచించినట్టు సమాచారం. ఈ విషయంలో ఆయన చొరవ తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేశవరావు ఈ సాయంత్రానికి హైదరాబాద్‌కి చేరుకోవచ్చునని భావిస్తున్నారు. అటు ఆర్టీసీ జేఏసీ కూడా.. కేకేను చర్చలకు ఆహ్వానించాలని ఇదివరకే కోరింది. ఆయన మధ్యవర్తిత్వాన్ని ఇప్పటికే జేఏసీ అంగీకరించింది. కాగా.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలంటూ.. […]

పరిష్కారం దిశగా ఆర్టీసీ సమ్మె..!
Follow us on

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సమ్మెను పరిష్కరించాల్సిందిగా.. తెలంగాణ సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు కేకేకు సూచించినట్టు సమాచారం. ఈ విషయంలో ఆయన చొరవ తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేశవరావు ఈ సాయంత్రానికి హైదరాబాద్‌కి చేరుకోవచ్చునని భావిస్తున్నారు. అటు ఆర్టీసీ జేఏసీ కూడా.. కేకేను చర్చలకు ఆహ్వానించాలని ఇదివరకే కోరింది. ఆయన మధ్యవర్తిత్వాన్ని ఇప్పటికే జేఏసీ అంగీకరించింది. కాగా.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలంటూ.. కేకే పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదివరకే సూచించారు. అలాగే.. కేకే ఢీల్లీ నుంచి రాగానే.. ఆర్టీసీ జేఏసీ, వామపక్షాలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.