తెలంగాణ ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతంగా మారుతుంది. ఇక తీవ్ర మానసికంగా ఒత్తిడికి గురవుతున్న కార్మికులు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట లో మరో ఆర్టీసీ కార్మికుడు బత్తిన రవి అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే అతడిని అడ్డుకుని కాపాడారు.
శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లాకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి సమ్మెలో భాగంగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి.. ఆదివారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.