మోహన్ బాబుతో వర్మ భేటీ.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

|

Mar 25, 2019 | 10:13 PM

హైదరాబాద్: సంచలన దర్శకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇలాంటివారని తాను ఎప్పుడూ అనుకోలేదని ట్విట్టర్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరును ట్యాగ్ చేస్తూ త్వరలో రిలీజ్ కాబోతోందన్న విధంగా సూచించారు. నటులు మోహన్‌బాబుతో ఆయన సమావేశమై చర్చిస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు గురించి నిజాలు మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటూ మోహన్ బాబుతో వర్మ అన్నారు. వెన్నుపోటుదారులను […]

మోహన్ బాబుతో వర్మ భేటీ.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు
Follow us on

హైదరాబాద్: సంచలన దర్శకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇలాంటివారని తాను ఎప్పుడూ అనుకోలేదని ట్విట్టర్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరును ట్యాగ్ చేస్తూ త్వరలో రిలీజ్ కాబోతోందన్న విధంగా సూచించారు.

నటులు మోహన్‌బాబుతో ఆయన సమావేశమై చర్చిస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు గురించి నిజాలు మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటూ మోహన్ బాబుతో వర్మ అన్నారు. వెన్నుపోటుదారులను లెంపకాయ కొట్టి, మోహన్‌బాబుకు చప్పట్లు కొడుతున్నట్టు తనకు అనిపిస్తుందని కామెంట్ చేశారు.

తన శ్రీ విద్యానికేతన్ కాలేజీకి రావాల్సిన ఫీజు రింబర్స్‌మెంట్ బకాయిలు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోహన్‌బాబు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.